K Kavitha With Turmeric Farmers: పసుపు బోర్డు వచ్చినా కూడా తమ సమస్యలు తీరకపోవడంతో నిజామాబాద్ పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు మద్దతు ధర కల్పించాలని పసుపు రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించడం.. పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టడంతో మరోసారి పసుపు రైతుల ఉద్యమం రాజకీయ దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పూర్తిగా విఫలమవడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. పసుపు రైతుల ఆందోళనకు కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, ధర్మపురి అర్వింద్‌పై మండిపడ్డారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్!
'నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది?' అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. క్వింటాలు పసుపుకు రూ.15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . కానీ ఇప్పుడు కనీసం రూ.9 వేలు రాని పరిస్థితి ఉంది' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే అని మండిపడ్డారు.
Also Read: KTR Chit Chat: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'రేవంత్ రెడ్డి వెనక నలుగురు బ్రోకర్లు'
'రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపు ధరలు పెంచుతామని.. మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









