K Kavitha Deeksha: ఒక విగ్రహం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ దీక్ష

MLC Kalvakuntla Kavitha Deeksha In Indira Park: తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో పోరాటాన్ని తీవ్రం చేయనున్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో భారీ దీక్ష చేపట్టనున్నారు. నేడు ఆమె దీక్ష శిబిరంలో కూర్చోనున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2025, 09:22 PM IST
K Kavitha Deeksha: ఒక విగ్రహం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ దీక్ష

Kalvakuntla Kavitha Deeksha: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో ఉద్యమాన్ని చేపట్టడమే కాకుండా ఆ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఈ క్రమంలోనే భారీ దీక్షకు ఆమె కూర్చోన్నారు. మద్యం కుంభకోణం ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం రాజకీయంగా మరింత చురుకయ్యారు. బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకున్న ఆమె ఈ క్రమంలోనే ఆమె ఓ విగ్రహం కోసం భారీ ధర్నా చేపట్టనున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్‌ సంచలన లేఖ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతోపాటు స్పీకర్‌కు విజ్ఞప్తులు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు.. నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కవిత ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఇందిరాపార్క్‌ వేదికగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 

Also Read: Bandi Sanjay: 'పాలనపై పట్టులేని రేవంత్‌ రెడ్డి రబ్బర్‌ స్టాంప్‌ ముఖ్యమంత్రి'

బీసీల ఆత్మ బంధువు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలాకాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. పలుసార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కవిత ఆధ్వర్యంలో జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను రెండుసార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీన పూలే జయంతిలోగా ప్రభుత్వం విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆల్టిమేటం జారీ చేసినా స్పందన లేదు.

విగ్రహ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇందిరా పార్కు వద్ద కవిత దీక్ష చేపట్టనున్నారు. బీసీల ఆరాధ్య దైవమైన పూలేను చట్టసభల ఆవరణలో ఏర్పాటుచేసి గౌరవించాలని కవిత డిమాండ్ చేయనున్నారు. గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కవిత పోరాటం ద్వారా అసెంబ్లీ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటైన విషయం తెలిసిందే. గాంధీ విగ్రహం పక్కన అంబేడ్కర్‌ విగ్రహానికి కవిత పోరాటం ద్వారా సముచిత ప్రాధాన్యం లభించింది. ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న దీక్షకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News