K Kavitha: 'చంద్రబాబును జల దోపిడీని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులి'

Kalvakuntla Kavitha Satires To Revanth Reddy: తెలంగాణకు వ్యతిరేకంగా జలదోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి పేపర్‌ పులిగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 18, 2025, 03:13 PM IST
K Kavitha: 'చంద్రబాబును జల దోపిడీని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులి'

Banakacherla Project: నక్సల్స్ ఎన్ కౌంటర్లను కేంద్ర ప్రభుత్వం ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అబద్దం చెప్పారని తెలిపారు. 'గోదావరి నది లింకేజీ తెలంగాణలో ఉన్న తుపాకులగూడెం వద్ద ఉండాలని కేసీఆర్ అన్నారు. గోదావరి నది లింకేజీ తుపాకుల గూడెం వద్ద ఉంటే తెలంగాణకు నీళ్లు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి లింకేజీ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతోంది' అని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: KTR Legal Notice: తెలంగాణలో కీలక పరిణామం.. టీపీసీసీ చీఫ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

'చంద్రబాబు నాయుడు ఏపీకి లాభం జరిగే విధంగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు ఉన్న లాలూచీ ఏమిటి?' అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం రావడం తప్ప చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. 'పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్లపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు జలదోపిడీని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులి అయ్యారు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: Telangana DA Hike: డీఏ 3.4% పెంపుతో ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు, బకాయిలు వివరాలు ఇలా..

'బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా బొల్లంపల్లిలో 150 టీఎంసీలతో రిజర్వాయర్ కడుతున్నారు. బొల్లంపల్లితో నల్లమల్ల అడవులు మునుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి గిన్నీస్ రికార్డు సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీకి ఒక్క సారి బీసీ బిల్లు ఆమోదంపై లెటర్ ఇవ్వలేదు' అని కవిత గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే వందలాది బీసీలతో నామినేషన్స్ వేయిస్తామని ప్రకటించారు. బీజేపీ వికసిత్ యాత్రలు ఎవరి కోసమని ప్రశ్నించారు. 'బీసీ బిల్లు బంతి బీజేపీ కోర్టులో ఉంది. జూలై 17వ తేదీన రైల్ రోకో చేస్తాం. తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్ళు ప్రయాణం వాయిదా వేసుకోండి' అని కవిత సూచించారు.

'బనకచర్ల ప్రాజెక్టు ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి. జాలై 17న రైల్ రోకోకు బీసీ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. రేవంత్ రెడ్డి ఢీల్లి టూర్ హాఫ్ సెంచరీ దాటింది' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News