Kavitha Met KCR: క్యా సీన్ హై.. విచారణ వెళ్లే ముందు కేసీఆర్ పక్కనే కవిత..

Kavitha Met KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ను కవిత కలవడం విశేషం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 11, 2025, 12:39 PM IST
Kavitha Met KCR: క్యా సీన్ హై..  విచారణ వెళ్లే ముందు కేసీఆర్ పక్కనే కవిత..

Kavitha Met KCR: బీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుట ఎగరేసిన తర్వాత కవిత.. తన భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. కేటీఆర్‌ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తాతను కలిసారు. 
మరోవైపు కాళేశ్వరం విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.  ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి డైరెక్ట్ గా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. విచారణ కమిషన్‌ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం  రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ దళం ర్యాలీగా వచ్చింది. కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరైన కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆన్‌ కెమెరా విచారణకు అనుమతించాలని జస్టిస్ ఘోష్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ కోర్టు విచారణను కేసీఆర్ నిరాకరించినట్లు సమాచారం.  కాగా కమిషన్‌ ఆన్‌ కెమేరా విచారణకు అనుమతించినట్టు సమాచారం. 

Add Zee News as a Preferred Source

కేసీఆర్ కాళేశ్వరం విచారణ సమయంలో అపశృతులు ఎదురవుతున్నాయి. భారీ కాన్వాయ్‌తో ఎర్రవల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కారును కార్ఖానా వద్ద కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. 

మరోవైపు ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్లు తెలుస్తోంది.  చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కాళేశ్వరం కమిషన్‌ ముందు కేసీఆర్​ విచారణకు హాజరయ్యేందుకు ముందు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అక్కడకి వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన జారి పడినట్టు తెలుస్తోంది.  

Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..

Also Read:  ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News