MLC Kavitha: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోకి కవితకు నో ఎంట్రీ బోర్డ్.. ? కూతురుపై కేసీఆర్ గుస్సా..!

MLC Kavitha: కేసీఆర్ కుటుంబంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అన్న కేటీఆర్ తో సమానంగా తనకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కవిత.. సొంత పార్టీపైనే తిరుగుబాబు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2025, 09:31 AM IST
MLC Kavitha: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోకి కవితకు నో ఎంట్రీ బోర్డ్.. ? కూతురుపై కేసీఆర్ గుస్సా..!

MLC Kavitha: ముఖ్యంగా తండ్రి కేసీఆర్ దేవుడు లాంటి మనిషిని..ఆయన చుట్టూ దెయ్యాలు చేరి ఆయను తప్పుదొవ పట్టిస్తున్నాయని కవిత చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఆ దెయ్యాలు ఎవరన్న ప్రశ్న అటు పొలిటికల్ వర్గాల్లో… ఇటు బీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అన్న కేటీఆర్.. బావ హరీష్ రావు దెయ్యాల్లా కేసీఆర్ ను పట్టిపీడుస్తున్నారనే అర్ధం వచ్చేలా కవిత మాట్లాడింది.కవిత.. సొంత తండ్రిని కలిసేందుకు కవితకు ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లోకి ఎంట్రీ లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసీఆర్‌కు కవిత లేఖ రాసిందా... 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇప్పుడు ఎలా బహిర్గతం అయ్యింది… ఇది ఫామ్‌ హౌస్‌ నుంచే లీక్ అయ్యిందా… లేక కవితే డ్రామా ఆడుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ విషయంలో కేసీఆర్.. మెతక వైఖరి అవలంబించడంతో పాటు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేయడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పుకొచ్చింది. 

అంతేకాదు పార్టీలో తనతో పాటు పార్టీ నమ్ముకున్న వాళ్లను కాకుండా.. బాకాలు ఊదేవాళ్లకే అందలం ఎక్కిస్తున్నారనే కామెంట్స్ చేయడం గమానార్హం. అయితే.. కవిత లేఖ తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్.. కూతురుపై కోపంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మధ్యలో కేసీఆర్.. కవితకు ఫోన్ చేసినా.. అందుబాటులోకి రాలేదనే వార్తలు వస్తున్నాయి. ఆమె వచ్చినా.. కలుస్తానన్నా.. కలవడానికి కేసీఆర్ సుముఖంగా లేరనే టాక్ బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. కవిత .. కాంగ్రెస్ చేతిలో పావుగా మారి వారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో కేసీఆర్.. తన కూతురును తన ఇంటికి రావొద్దని చెప్పినట్టు సమాచారం.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:   కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News