Mlc kavitha slams cm revanth reddy govt das issue: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం.. ఇది చేస్తామని.. ప్రజలను కపట హమీలతో మోసం చేశారని కవిత అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తాజాగా.. జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్న పెండింగ్ డీఏలలో కేవలం ఒకటి మాత్రమే ఇవ్వడంను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనస్తాపనకు గురయ్యారని వెంటనే పెండిండ్ డీఏలను విడుదల చేయడంతో పాటు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ఎద్దేవా చేశారు.
ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి.. కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









