Teenmar mallanna meets with harish rao and ktr: తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు రాజకీయాలు సమ్మర్ వేడిని మరింత పెంచేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా అపోసిషన్ పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక వైపు బీఆర్ఎస్ నేతల్ని, మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని రేవంత్ రెడ్డి చెడు గుడు ఆడుకుంటున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
అదే విధంగా ఇతర పార్టీల నేతలు సైతం.. రేవంత్ వ్యాఖ్యల్ని గట్టిగానే తిప్పి కొడుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన తీన్మార్ మల్లన్న తెలంగాణ బీఆర్ఎస్ నేతలైన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కలవడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేధికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన తీన్మార్ మల్లన్న pic.twitter.com/LGbsEDXd3Q
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025
గతంలో తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ వేదికగా.. బీఆర్ఎస్ చేసిన అనేక అక్రమాలను, బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ప్రతిరోజు ఎండగడుతూ వారికి చుక్కలు చూపించారు. మాజీ సీఎం కేసీఆర్ ను, ఆయన పాలనపై బహిరంగంగా తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా తీన్మార్ మల్లన్నపై గత సర్కారు అక్రమ కేసులు పెట్టిందని... అనేక పర్యాయాలు క్యూన్యూస్ ఆఫీస్ పై పోలీసుల్ని అడ్డంపెట్టుకుని దాడులు సైతం చేసిందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న తెలంగాణ బీసీల కోసం ఎంతకైన వెళతానని ప్రకటించాడు. అధికార కాంగ్రెస్ చేపట్టిన ఇటీవల జనగణలో బీసీలకు అన్యాయం జరిగిందని.. బీసీలను తక్కువ శాతం చూపించారని కూడా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పాలనను విమర్శించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న బీసీలకు న్యాయం చేసేందుకు తాను ఎంతదూరమైన వెళ్తానని... పార్టీలకతీతరంగా బీసీలను ఒకతాటిపైకీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానన్నారు. ఈ క్రమంలో..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి టి.హరీష్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావులను కలిసి.. బీసీల వివరాలతో కూడిన వినతీపత్రంను అందజేశారు.
అదే విధంగా.. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మల్లన్న కోరారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు కూడా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే..ఒంటి కాలి మీద నిలబడే తీన్మార్ మల్లన్న .. తాజాగా.. బీఆర్ఎస్ నేతల్ని కలడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హట్ టాపిక్ గా మారింది.
మరోవైపు గత సర్కారు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించి,జైలు కూడా పంపించింది. ఆ తర్వాత అనేక పరిణామల మధ్యన ఆయనకు బెయిల్ వచ్చింది. అయిన కూడా తీన్మార్ మల్లన్న ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తునే ఉన్నారు.
Read more: Telangana Assembly Budget Session: నేడు తెలంగాణ శాసనసభ ముందుకు కీలక బిల్లులు..
ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎనుకున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.