Teenmar Mallanna: బిడ్డా రేవంత్.. ఇక కాస్కో నా తడాఖా చూపిస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై శివాలెత్తిపోయిన తీన్మార్ మల్లన్న..

Teenmar mallanna reacts on suspension: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఇటీవల కాంగ్రెస్ పార్టీ  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. తీన్మార్ మల్లన్న రియాక్ట్ అయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 5, 2025, 03:46 PM IST
  • మళ్లీ రెచ్చిపోయిన తీన్మార్ మల్లన్న
  • బీసీల కోసం దేనీకైన సిద్దమంటూ వ్యాఖ్యలు..
Teenmar Mallanna: బిడ్డా రేవంత్.. ఇక కాస్కో నా తడాఖా చూపిస్తా..  కాంగ్రెస్ ప్రభుత్వంపై శివాలెత్తిపోయిన తీన్మార్ మల్లన్న..

Teenmar mallanna fires on cm revanth reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జనగణనను ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యంగా దీన్ని రాహుల్ గాంధీ తన మానస పుత్రికలా భావించారు. అయితే.. తెలంగాణలో ఇటీవల చేసిన కులగణనలో.. బీసీ కులగణన ప్రస్తుతం వివాస్పదంగా మారింది. కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన తప్పుల తడక అని.. ఇందులో బీసీ జనభా శాతాన్ని తక్కువ చేసి చూపించారని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏకంగా బీసీ గణన ప్రతులను కాల్చేశారు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. రెడ్డీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత తీన్మార్ మల్లన్నను ఏఐసీసీ సస్పెండ్ చేసింది. దీనిపై తీన్మార్ మల్లన్న తాజాగా స్పందించారు.  సీఎం రేవంత్ రెడ్డి తనను చాలా రోజుల నుంచి సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

ఇక బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుండే నడిపించడానికి బీజం మీరే వేశారని శివాలెత్తిపోయారు. కొన్నిరోజులుగా తమ బీసీ బిడ్డలు దీనిపై స్పందించాలని కోరుతున్నారని అన్నారు. అందుకే ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో మలిదశలో ఉద్యమంను నడిపంచిన బీసీలు, ఇప్పుడు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం.. బీసీ లపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటే, భయపడే ప్రసక్తి లేదన్నారు.

ఒక వేళ తప్పుడు సర్వే ప్రతులను కాల పెట్టడం తప్పు అనిపిస్తే..  అదే తప్పు ను మళ్లీ మళ్ళీ చేస్తా అని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం వదిలేదిలేదన్నారు. మీరు ఇటీవల చేసిన జనగణను తప్పుల తడక అని, ఎక్కడికొచ్చి అయిన నిరూపించేందుకు సిద్దమని అన్నారు. 
ముఖ్య మంత్రి ఒక బాధ్యతయుత పదవిలో ఉండి కూడా.. బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తే తనను టార్గెట్ చేశారన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో మంది నాయకులు పుట్టుకొచ్చేలా చేసిందన్నారు.  బీపీ మండల్ లాంటి మంచి చేసిన వారిని గుర్తు ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారన్నారు.

 కాంగ్రెస్ పార్టీ లో అగ్ర వర్ణాలకు మాత్రమే అంతర్గత భద్రత ఉంటుంది. కానీ బడుగు బలహీన వర్గాల పైనే మీరు ప్రతాపం చూపిస్తే ఊరుకునేదిలేదన్నారు. మీ షోకాజ్ నోటీసులకు భయపడేవ్యక్తిని కాదని అన్నారు.  రాహుల్ గాంధీ ఆశయాలకు ఎంతవరకైన వెళ్తానన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్లేదిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను సీట్లు గెలిపించిందని చెప్పుకుంటున్నారని.. తనకు ఎవరు కూడా గెలిపించేందుకు సహాయం చేయలేదన్నారు.

Read more: YS Jagan: పవన్ కళ్యాన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ .. మళ్లీ ఏకీపారేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్..  

 మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారని మండిపడ్డారు.  ఈ రోజు జరుగుతున్న ఎమ్ ఎల్ సి ఎన్నికలను చూస్తే బీసీ ల శక్తి ఏంటో తెలుస్తుందన్నారు. బీసీలు శక్తివంచన లేకుండా గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ని మీరు ఖతం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. . బీసీల కోసం ఎంత దూరమైన వెళ్తామని, బీసీ వాదానికి కట్టుబడి ఉంటానని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News