MLC Teenmar Mallanna: రేవంత్ రెడ్డి ఖేల్ ఖతం.. 6 నెలల్లో ఇంటికే... తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

MLC Teenmar Mallanna Shocking Comments On CM Revanth Reddy:  తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలోనే సంచలనం నమోదు కాబోతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో పదవి నుంచి దిగడం ఖాయమని, ఆయన స్థానంలో బీసీని కానీ, మంత్రి శ్రీధర్ బాబును కానీ ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని బాంబు పేల్చారు.

Written by - Bhoomi | Last Updated : Apr 30, 2025, 11:38 PM IST
MLC Teenmar Mallanna: రేవంత్ రెడ్డి ఖేల్ ఖతం.. 6 నెలల్లో ఇంటికే... తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

MLC Teenmar Mallanna Shocking Comments On CM Revanth Reddy: తెలంగాణలో రాబోయే ఆరు నుంచి ఏడు నెలల కాలంలో  99 శాతం  ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. జీ  తెలుగు  న్యూస్ స్టూడియోలో  జరిగిన  వర్తమాన రాజకీయాలపై చర్చలో భాగంగా  తీన్మార్ మల్లన్న  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  దిగిపోవడం తధ్యమని ప్రకటించారు. రేవంత్ రెడ్డి స్థానంలో బీసీ  అభ్యర్థిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని,  రేవంత్ రెడ్డి బదులుగా రెడ్డి సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.  

Add Zee News as a Preferred Source

ఓసి కులాల్లో మంత్రి శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు.  బ్రాహ్మణ ముఖ్యమంత్రితో బీసీలకు ఎలాంటి అభ్యంతరం లేదని, 1970 దశకంలో  ల్యాండ్ సీలింగ్ యాక్ట్  ప్రవేశపెట్టి అప్పటి  అవిభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  పీవీ నరసింహారావు  బీసీలకు భూములు పంచి పెట్టారని, అందుకే వారిపై కృతజ్ఞత ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరిపోవడం లేదని,  ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ సభలో మాజీ సీఎం  కేసీఆర్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా, మంత్రుల పేరు ఎత్తకుండా  మాట్లాడారని దీనిబట్టి,  ప్రభుత్వానికి బలం లేదన్న సంగతి తేటతెల్లమైందన్నారు.  కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా మంత్రులు లేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. 

Also Read: India vs Pakistan: భారత్ ఈ పని చేస్తే పాకిస్తాన్ లో మిగిలేది బొద్దింకలే.. ఉగ్రవాదుల కంటే అవే బెస్ట్ లే! కానీ ఇది ఎలా సాధ్యమంటే?  

 పైకి రాహుల్ గాంధీ చెబుతున్న పనులన్నీ చేస్తున్నామని కనిపిస్తున్నప్పటికీ లోపల జరుగుతున్న వ్యవహారం అంతా వేరుగా ఉందని ఆ విషయం రాహుల్ గాంధీకి సైతం తెలుసని అందుకే ముఖ్యమంత్రి మార్పు అనేది తధ్యమని  తీన్మార్ మల్లన్న తనదైన విశ్లేషణ  ద్వారా తెలిపారు.  ఇది కేవలం ముఖ్యమంత్రి మార్పుతో  పరిమితం కాదని తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రయోగం చేయబోతుందని,  తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా మార్చేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని,  ఇందులో భాగంగా సంపదను అన్ని వర్గాలకు చేరవేయడమే ఆయన లక్ష్యమని,  తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మల్లన్న పేర్కొన్నారు.

 తెలంగాణలో మెజార్టీ ప్రజల  అభిమానాన్ని చురగొనెల రాహుల్ గాంధీ ప్రణాళిక ఉంటుందని, ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి విభేదించే అవకాశం సైతం ఉందని  మల్లన్న  జోస్యం చెప్పారు.  ఇదిలా ఉంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో  బిజెపి సైతం కుల గణన ద్వారా  మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

Also Read: India-Pakistan: భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతలతో ఈ పువ్వు ధర ఏకంగా  1 కేజీ రూ. 5 లక్షలు దాటింది..ఏంటో తెలిస్తే షాకే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News