)
Mohammad Azharuddin gets minister post in Telangana congress: జూబ్లిహిల్స్ఉప ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. మరో రెండు రోజులలో కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఈ విస్తరణలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కి అవకాశం ఇచ్చారు. దీనిలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి.
రాజ్ భవన్లో అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మిగిలిన రెండు మంత్రి స్థానాలను కూడా త్వరలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి ఆతర్వాత మంత్రిగా చాన్స్ ఇవ్వనున్నారు.
గతంలో కూడా.. అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణంలో మైనారిటీలు లేనందున.. అజరుద్దీన్ కు మంత్రిగా చాన్స్ అవకాశం ఇవ్వడంతో ఆ లోటును తీర్చినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం రోజున అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమరం ప్రస్తుతం రాజకీయంగా హట్ టాపిక్‌గా మారింది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారవేగంను పెంచాయి.
ఎలాగైన జూబ్లిహిల్స్ లో గెలిచి తమ సత్తాచాటాలని అన్ని పార్టీలు ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో నేతల మధ్య మాటల యుద్దం పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మైనారీటీ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఈ ఎన్నికల్లో కొంచెం ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి