MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ దాటిందని.. ఆయన కొండంత రాగం తీసి పాట కూడా పాడలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైడ్రోజన్ బాంబు కాదు.. కనీసం ఉల్లిగడ్డ బాంబు కూడా పేలలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మీద కేటీఆర్ బురద చల్లుతున్నారని.. ఆయన మాట్లాడే మాటలకు అర్ధం పర్ధం లేదని ఫైర్ అయ్యారు. గ్రౌండ్ వర్క్ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్ ప్రెస్ మీట్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
"ఐసీసీఐ రుణం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. Tsiic ఫేస్ వాల్యూ చూసి 37 మంది బాండ్లు కొన్నారు. కొనుకున్న బాండ్ల పైసలు అన్ని ICICI లో పడతాయి. ఆ విధంగానే డబ్బులు పడ్డాయి. నిన్న కేటీఆర్ భూమి విలువ రూ.5,200 కోట్లు అంటారు.. కేటీఆర్ శిష్యుడు రూ.20 వేల కోట్లు అంటారు. ఎవరి మాట నమ్మాలి. కేటీఆర్ నిన్న బేస్ లెస్ ప్రెస్ మీట్ పెట్టారు. లిటికేషన్ బ్యాంక్‌కు Icici బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చిందని అడిగారు. బ్యాంక్ లోన్ ఇవ్వలేదు. బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులు మాత్రమే మాకు ఇచ్చింది. అవి HCU భూములు కావు.. అటవీ భూములు కావని ఈ విషయం ద్వారా తేటతెల్లం అయ్యింది.
సామాన్య ప్రజలను తప్పుతోవ పట్టించాలని చెప్పిన మాటలే తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదు. హైదరాబాద్‌లో జూ ఉంది అంటే నమ్ముతారు.. కానీ అడవి ఉంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి.. పేద ప్రజలు సన్నబియ్యం తింటే BRS వాళ్లు ఓర్చుకోవడం లేదు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణను కుక్కలు చింపిన విస్తారాకు చేశారు. ఆ విస్తరాకును కుట్టి అందులో సన్న బియ్యం అన్నం పెడుతుంటే వాళ్లు ఓర్చుకోలేక పోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు పెట్టే ప్రెస్ మీట్‌లను జనాలు నమ్మకండి. వాళ్లు అబద్ధాలు చెపుతున్నారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాల్లో పాల్గొనండి. అక్కడ ఏమైనా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి సమస్య పరిష్కారం చేస్తాం.
వచ్చే ఎపిసోడ్‌లో అయిన బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలి. హైడ్రోజన్ బాంబ్ కాదు. కనీసం ఉల్లిగడ్డ బాంబు కూడా పేలలేదు. ప్రభుత్వం మీద కేటీఆర్ బురద చల్లుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు అర్ధం పర్ధం లేదు. గ్రౌండ్ వర్క్ లేకుండా మాట్లాడుతున్నారు.." అని ఎంపీ చామల ఫైర్ అయ్యారు.
Also Read: Liquor Lovers: మందుబాబులకు పండగ లాంటి వార్త.. ఇక మీదట థియేటర్లలో ఏంచక్కా తాగుకుంటూ సినిమా చూడొచ్చు..
Also Read: UPI Payments: దేశమంతా నిలిచిపోయిన యూపీఐ సేవలు, చెల్లింపుల్లో అంతరాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









