)
Kavitha vs DK Aruna: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలను కొట్టి పడేశారు. ఆమె ఏ రాజకీయం కోసం ఈ డైలాగులు కొట్టిందో తెలియదని పేర్కొన్నారు. 'లోగుట్టు ఎవరికెరుక. కాళేశ్వరం విషయంలో కమిటీ, నివేదికలు అంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కావాలనే తాత్సరం చేసింది' అని ఎంపీ అరుణ ఆరోపించారు.
'కాళేశ్వరం అవినీతిలో పాపమంతా వారిదే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికి కాళేశ్వరం అవినీతిలో భాగం ఉంది. ఇప్పుడొచ్చి కవితమ్మ ఏ పాపం తెలియడంటే ముక్కున వేలు వేసుకుంటారు తప్పితే ఎవరూ నమ్మరు' అని ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. 'కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోంది. ఆ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసు సీబీఐకి అప్పగించొచ్చు కదా' అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
'కమిటీలు, విచారణలు, నివేదికలు అన్నారు. అ నివేదికలో ఏమున్నదో ఎందుకు బయట పెట్టలేదు. చివరకు అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది కాంగ్రెస్ తీరు' అని డీకే అరుణ తెలిపారు. కాళేశ్వరం అవినీతి పై సీబీఐ విచారణ చేయించాలని తాము ముందు నుంచి కోరుతున్నట్లు చెప్పారు. 'ఏదో చేద్దామనుకున్నారు. ఏమి చేయలేరాని తేలిపోయింది ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఇప్పటికైనా సీబీఐ విచారణకు కాంగ్రెస్ సహకరించాలి' అని డీకే అరుణ డిమాండ్ చేశారు. 'కవిత మాటలు ట్రాష్. కాళేశ్వరం డిజైన్ చేసిందే నేను అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు విచారణకు వస్తే కేసీఆర్‌కు ఏ పాపం తెలియదు అంటే నమ్మేస్తారా. కవిత మాటలు ఎవరూ నమ్మరు' అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.