Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

Eatala Rajendar fires on cm revanth reddy:  లియోనల్ మెస్సీ హైదరాబాద్ ఫుట్ బాల్ మ్యాచ్ ఈవెంట్ పై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. వంద కోట్ల ప్రజాధనంను రేవంత్ సర్కారు వెస్ట్ చేస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా.. ప్రజాసమస్యలు తీర్చడానికి డబ్బులు లేవని, ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని ఏకీపారేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 03:14 PM IST
  • కాంగ్రెస్ పై ఈటల ఫైర్..
  • వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సీరియస్..
Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

MP Eatala Rajendar slams on cm revanth reddy over lionel messi event: దేశంలో ప్రస్తుతం లియోనల్ మెస్సీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఫుడ్ బాల్ దిగ్గజంను చూసేందుకు దేశ వ్యాప్తంగా అభిమానులు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. మరోవైపు లియోనల్ మెస్సీతో, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సాయంత్రం ఫ్రెండ్లీ ఫుడ్ బాల్ మ్యాచ్ ఆడనున్నారు. లియోనల్ పర్యటనపై ఇప్పటికే తెలంగాణలో పొలిటికల్ రచ్చ రాజుకుంది. తాజాగా.. దీనిపై బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్ లా వ్యవహరిస్తున్నారంటూ ఏకీపారేశారు.

Add Zee News as a Preferred Source

ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్బాల్ ఆటలు ఏంటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి అదే విధంగా.. సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ సింగరేణి డబ్బులు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రశ్నలు సంధించారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదని  ఎద్దేవా చేశారు.
మరోవైపు కల్వకుంట్ల కవిత నేతలపై  చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

హుజురాబాద్ లో సోషల్ మీడియా పోస్టులు కొంత మంది అవగాహన లేని వారు చేస్తున్న పని అన్నారు. వీరి మీద పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల మొదటి ఫెస్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. సీఎం రేవంత్ పాలన పట్ల లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుందన్నారు.  అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు.  కమలాపూర్ లో కుట్రలను ఛేదించి సతీష్ ని గెలిపించినందుకు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఈటల చెప్పుకొచ్చారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎన్ని ప్రచారాలు, ప్రలోభాలకు తెరతీసిన బీజేపీ బలపర్చిన  అభ్యర్థులు కమలాపూర్ లో శనిగరం గుండేడు గూడూరు గెలిపించడమే కాకుండా మేము మద్దతు ఇచ్చిన ఐదు గ్రామాలు దేశరాజు పల్లి కానిపర్తి గోపాలపురం మాదన్నపేట నేరెళ్లలో కూడా విజయం సాధించినట్లు చెప్పారు.

Read more: Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..

గెలిచిన తర్వాత ఐదు లక్షలు,  10 లక్షలు ఇస్తాం మా పార్టీకి రండి మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోడని చిల్లర ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఎన్నికలముందే మాకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉంది అని చెప్తే మంచిది కానీ, ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయన వెనుక,  ఈయన వెనక పోతాము అంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదని ఈటల అన్నారు.  మొత్తంగా గెలిచినవారు ప్రజలకు సేవ చేయాలని  ఈటల గెల్చిన సర్పంచ్, ఉపసర్పంచ్ లను కోరారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News