Nita ambani 1 crore donation to balkampet yellamma temple: హైదరాబాద్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆలయాల్లో బోనాల సందడి కన్పిస్తుంది.ఈ నేపథ్యంలో ఆలయాలు అన్ని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. బోనాల పండగ జూన్ నెల 26 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరుగనున్నాయి.
అయితే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి.. నీతా అంబానీ ఈ ఏడాది ఏప్రిల్ 23 న హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు.
ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశాడు. పూజారులు ఆలయ విశిష్టతను వారికి వివరించారు. అదే విధంగా.. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ తాజాగా.. రూ. కోటి విరాళాన్ని అందించారు. ఈ విరాళం మొత్తాన్ని బ్యాంకులో జమచేసి, దానిపై వచ్చే వడ్డీతో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రస్తుత ఇన్‌ఛార్జి ఈఓ మహేందర్‌గౌడ్ తెలిపారు.
Read more: Bonalu 2025: హైదరాబాద్ బోనాల జాతర.. ముఖ్యమైన తేదీలు ఇవే..!
మరోవైపు నీతా అంబానీ బల్కంపేట అమ్మవారు అంటే చాలా నమ్మకంగా పూజిస్తారు. హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చిన కూడా అమ్మవారిని దర్శించుకునందే వెళ్లరు.ఈ క్రమంలో ఇటీవల ఆలయంలో పలు డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమకు తోచిన సాయం చేయాలని ఆలయ అధికారులు నీతా అంబానీని కోరారు. దీనితో ఈ విధంగా సాయం చేసి నీతా అంబానీ అమ్మవారి మీద ఉన్న తన భక్తిని చాటుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook