Munnuru Kapu Leaders Meeting: వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీ.. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ నేతలు..

Munnuru Kapu Leaders Meeting: తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కులగణన ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు రెడ్లపై ఇతర ఓసీ కులాలపై నోటికి వచ్చినట్టు వాగడం ఆయనకు చేటు తెచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో తీన్మార్ మల్లన్నకు సామాజిక వర్గానికి చెందిన నేతలు వీహెచ్ ఇంట్లో భేటి  కావడం రాజకీయంగా కాక రేపుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 1, 2025, 06:55 PM IST
Munnuru Kapu Leaders Meeting: వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీ.. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ నేతలు..

Munnuru Kapu Leaders Meeting: తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన కులగణన .. ఆ పార్టీకి బ్యాక్ బౌన్స్ అయిందనే చెప్పాలి. ఈ కులగణన అంతా తప్పుల తడక.. ఇందులో బీసీలను తక్కువ చేసి చూపించారని ఆ పార్టీకి చెందిన నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగాయి. అంతేకాదు ఈ సందర్బంగా ఓసీ కులాలైన రెడ్లుపై పరుష పదజాలంలో విమర్శించారు. అంతేకాదు  కమ్మ, వెలమ కులాలను  నోటికి వచ్చినట్టు మాట్లాడంతో .. పార్టీ లైన్ ను క్రాస్ చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో అతన్ని  కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్  చేసింది. ఈ నేపథ్యంలో  మున్నూరు కాపు నేతలు కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడు వీ హనుమంత రావు ఇంట్లో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో  మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు.  వి హెచ్ ఇంట్లో జరిగిన ఈ భేటీకి  కాంగ్రెస్, బీజేపీ,బిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్నూరు కాపు కీలక నేతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణనలో మొత్తం తప్పుల తడకగా అభివర్ణించారు. అంతేకాదు ఇందులో బీసీల సంఖ్యను కావాలని తగ్గించి చూపంచారని అక్కడి వచ్చిన మున్నూరు కాపు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ,బిఆర్ఎస్ పార్టీల్లో కాపులకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్ లో కరువైందన్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

మున్నూరు కాపులు మంత్రి వర్గంలో లేక పోవడం ఇదే మొదటి సారన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది. దీంతో అంతే విధేయతతో పనిచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసిఆర్ కూడా మున్నూరు కాపులు అవసరాన్ని గుర్తించారు. రెండు సార్లు మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు.  ఎమ్మేల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపి లుగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.  బీజేపీ,బిఆర్ఎస్ నుండి దక్కినన్ని ఎమ్మెల్యే,ఎంపి టికెట్లు..కాంగ్రెస్ నుండి రాలేదన్నారు. నామినేటెడ్ పోస్టులో అన్యాయం జరుగుతోందన్నారు.  మున్నూరు కాపులను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు నేతలు. డి.శ్రీనివాస్,కేకే,వి.హెచ్,పొన్నాల లకు దక్కిన స్థాయి నేడు కాంగ్రెస్ లో లేదని నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓ సామాజిక వర్గం మన మీద కుట్రలే కాదు.. దాడి చేసినంత పని చేస్తోందన్నారు. మన ప్రాధాన్యత తగ్గిస్తే...మనం కూడా తగ్గించడం అనివార్యమన్నారు నేతలు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం పై కూడా చర్చించారు. ఎమ్మెల్సీ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్  ఎత్తుకున్న నినాదం కరక్టే కానీ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక బీసీ నేతపైనే కాదు..పార్టీ లైన్ దాటిన ఇతర నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని అక్కడికి వచ్చిన నేతలు  అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా  మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేతలు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News