Nagarkurnool Gang rape case latest news: ఉగాది రోజున నాగర్ కర్నూల్ లోని ఊర్కొండ పేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు ఒక కుటుంబం వచ్చింది. రాత్రి పూట అక్కడే పడుకున్నారు. ఇంతలో ఒక మహిళ బహిర్బూమికి వెళ్లింది. అప్పటికే ఆమెను కొంత మంది కేటుగాళ్లు ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా ఆమె వెనుకాలే వెళ్లారు. ఆమెతో పాటు మరో యువకుడు అక్కడే చీకట్లో చనువుగా మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో నీచులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి.. మహిళను పొదల్లోకి లాక్కెళ్లి.. సదరు వ్యక్తిని అక్కడే కట్టేశారు. మహిలపై రాత్రంత పాశావికంగా ఒకరి తర్వాత మరోకరు అత్యాచారం చేస్తు నీచంగా ప్రవర్తించారు. మహిళ దాహం వేస్తుందంటే.. ఆమె నోట్లో మూత్రవిసర్జన చేసినట్లు విషయం బైటపడింది.ఈ క్రమంలో మహిళ వారినుంచి తప్పించుకుని ఉదయం మరో వ్యక్తిని విడిపించుకుని వెళ్లి ఇంట్లో వాళ్లకు ఈ ఘెరం చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం జల్లెడ పెట్టారు.
నిందితుల్లో ఒక వ్యక్తి ఆ ఆలయంలో అవుత్ సోర్సింగ్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనే దీనికి కారణమైని కూడా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. తొలుత సదరు మహిళతో వెళ్లిన వ్యక్తి ఆమె భర్తఅని అనుకున్నారు. కానీ విచారణలోవారిద్దరు దంపతులు కాదని.. విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరు ఏకంతంగా చాలా దగ్గరగా ఉండటంతో వచ్చిన కేటుగాళ్లు వాళ్లను బెదిరింపులకు గురిచేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తెల్లవారు జామున ఇదే విషయం ను ఎవరికైన చెబితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే.. ఈ ఘటన తర్వాత పోలీసులు దర్యాప్తు వేగంను పెంచారు.ఈ మేరకు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
ఇటీవల రాత్రి 10.30 గంటల సమయంలో వివాహిత, మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఆలయానికి వచ్చినట్లు, అక్కడున్న కాంట్రక్ట్ ఉద్యోగి గమనించాడు. వారు అనుమానస్పదంగా ఉండటంతో తన మిత్రులకు సమాచారం ఇచ్చాడు. వారు రాత్రి పూట చీకట్లో వెళ్లడంను వీరంతా ఫాలో అయి.. మూకుమ్మడిగా దాడి చేసి అత్యాచారంకు పాల్పడ్డారు.
రాత్రి 12 నుంచి ఉదయం 3 వరకు ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తొంది. మొదట మహిళ జరిగిన విషయం చెప్పకుండా.. గుర్తు తెలియని వ్యక్తులని చెప్పింది. కానీ అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించగా..
ఆలయ ఒప్పంద కార్మికుడు మహేశ్ గౌడ్ బాధితురాలిని బెదిరించడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మహేశ్ గౌడ్‌ను విచారించగా జరిగిన ఘటన బైటపడింది.
ఈ క్రమంలో.. ఊర్కొండపేటకు చెందిన సాధిక్ బాబా, హరీశ్ గౌడ్, మారుపాకుల ఆంజనేయులు గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్, మణికంఠ గౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తీక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిపై తొందరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జీషీట్ ను వేస్తామని... కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









