Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ కోర్టు..

Miryalaguda Caste killing case: మిర్యాల గూడలో సంచలనంరేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 10, 2025, 12:45 PM IST
  • ప్రణయ్ కేసులో కీలక పరిణామం..
  • తీర్పు వెల్లడించిన నల్గొండ కోర్టు..
Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ కోర్టు..

Nalgonda court verdict on miryalaguda pranay murder case: నల్గొండ జిల్లా మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో   సంచలనంగా మారింది. 2018 లోఅమృత ప్రణయ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అమృత  తండ్రికి ఇష్టంలేదు. దీంతో సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న అమృత ప్రెగ్నెంట్ నేపథ్యంలో ఆస్పత్రికి చెకప్ కు వెళ్తుండగా.. సుపారీ గ్యాంగ్ దారికాచి అత్యంత క్రూరంగా ప్రణయ్ ను హత్య చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ ఘటనలో పోలీసులు 8 మందిపై కేసులను నమోదు చేశారు. ఈ పరువు హత్య అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దాదాపు.. 1600ల పేజీల చార్జీషీట్ ను నల్గొండ కోర్టులో దాఖలు చేశారు. ఈ రోజున దీనిపై నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు తుదితీర్పును వెలువరించింది.

ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతీరావు... 2020 లో బెయిల్ మీద విడుదలై గతంలో సూసైడ్ చేసుకున్నారు. దాదాపుగా ఈ కేసులో ఐదేళ్లకు పైగా  ఎక్కువగా విచారణ జరిగింది. నల్గొండ పోలీసులు ఈ పరువు హత్య కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా..  ప్రతి ఒక్క ఎవిడెన్స్ లను సేకరించి.. కోర్టులో ప్రవేశపెట్టారు. 

Read more: Raveena Tandon Video: ద్యావుడా.. చెవిదిద్దులను గిప్ట్‌గా ఇచ్చేసిన బాలీవుడ్ నటి.. నీది గోల్డ్ గుండె అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

ఈ క్రమంలో నల్గొండ కోర్టు తాజాగా... ఏ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా.. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. 

 ప్రణయ్ పరువు హత్య కేసులో..  ఏ1 గా మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మ(బీహర్), ఏ3గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దాల్ భారీ, ఏ5 గా, అబ్దుల్ కరీం, ఏ6 గాశ్రావణ్ (మారుతీ రావు తమ్ముడు), ఏ7గా శివ (మారుతీరావు కారు డ్రైవర్), ఏ8 గా నిజాం (ఆటో డ్రైవర్)లుగా ఈ కేసులో ఉన్న నిందితులకు కోర్టు తుది శిక్షను విధించింది. ఈ క్రమంలో ఇన్నాళ్లకు ప్రణయ్ కేసులో కోర్టు తుదీ తీర్పు వెలువరించడంతో ఈ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News