Nalgonda Bus Fire Accident: రాష్ట్రంలో వరసగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు, చేవెళ్ల ఇలా తెలుగు రాష్ట్రాలలో ఘోర బస్సు ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఈరోజు ఉదయం తాజాగా మరో ఘోర బస్సు ప్రమాదం నల్గొండ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ బయలు దేరిన విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని మరీ బయటికి దూకారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర బస్సు ప్రమాదం నేషనల్ హైవే 65 పీట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగింది. అక్కడికి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులంతా ప్రాణ భయంతో వెంటనే బస్సు కిటికి అద్దాలు పగులగొట్టి మరీ బయటకు దూకారు. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న విహారి ట్రావెల్స్ బస్సు. కొద్ది క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఇక కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది ప్రయాణీకులు సహజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత చేవెళ్ల వద్ద తాండూర్ డిపోకు చెందిన బస్సు, కంకర్ టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృతి చెందారు.
డ్రైవర్ అప్రమత్తం..
ఇక ఈ నల్గొండ వద్ద జరిగిన ఘోర బస్సు ఫైర్ యాక్సిడెంట్‌లో 29 మంది ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన వెంటనే సకాలంలో డ్రైవర్ స్పందించాడు. ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చి ప్రయాణికులకు సహాయక చర్యలు చేశారు. అయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటన డ్రైవర్ నిర్లక్ష్యము కారణమన్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కూడా 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
ఇక చేవెళ్ల బస్సు, టిప్పర్ ప్రమాదంలో కూడా 19 మంది చనిపోయారు. ఈ ఘటనలో రహదారి చిన్నగా ఉండటంతో.. అక్కడ గుంత కూడా ఏర్పడడంతో ఘోర ప్రమాదం జరిగింది. కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా లోడ్ అంతా బస్సు లోపల పడి, అందులో కూరుకుపోయి ప్రాణాలు విడిచారు ప్రయాణికులు.
Read more: చీప్.. చీప్.. జియో బంపర్ ప్లాన్, ఎంత తక్కువ తెలిస్తే ఇప్పుడే రీఛార్జ్ చేస్కుంటారు..!
Read more: 9 కోట్ల మంది రైతుల ఎదురు చూపులకు చెక్.. పీఎం కిసాన్ నిధుల విడుదల ఆరోజే ఫిక్స్..!
Another Bus fire accident at Hyd to Vjwada route… em jarugutundi ra asalu! pic.twitter.com/DNP9RGj7n6
— cR🔱 (@ReddyTweetzzz) November 10, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









