)
Naveen Yadav takes sworn as Jubilee hills Congress mla video: తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల హాడావిడి మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ ల అంశం మీద వాయిదా పడ్డ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ డిసెంబర్ 11 న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 14, మూడో దశలో డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత ఎన్నికల అధికారులు రిజల్ట్ ను ప్రకటిస్తారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన వి.నవీన్ యాదవ్ pic.twitter.com/FhZSCb2BV0
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025
మరోవైపు సర్పంచ్ ఎన్నికలపై ఇప్పటికే కేటీఆర్ కాంగ్రెస్ పై పంచ్ లు వేశారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ట్విట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికలపై కూడా అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. మరోవైపు ఇటీవల జూబ్లిహిల్స్ బై పోల్స్ లో 25 వేల భారీ మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యావత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంకు మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్ తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు.
మరోవైపు.. తనపై ఎంత చెడుగా ప్రచారం చేసిన కూడా భారీ మెజార్టీతో గెలపించిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జూబ్లిహిల్స్ నియోజక వర్గంను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని నవీన్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook