)
Telangana New Cabinet Ministers: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ముగ్గురు మంత్రులను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించి వాళ్లకు అభినందనలు కూడా తెలియజేశారు .ఇక కొత్తగా ఎన్నికైన వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు కూడా ఆయన తెలియజేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేధికగా పోస్ట్ చేసి వాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఇక ఎన్నికైన వారికి ఆదివారమే మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోమాజిగూడ లోని రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం కూడా చేయించనున్నారు.
ఇక కొత్తగా ఎన్నికైన ఈ ముగ్గురు మంత్రులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేస్తుందని అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇక డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కూడా మహేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఈసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో వాకిటి శ్రీహరి( ముదిరాజ్) వివేక్ (మాల) అడ్లూరి లక్ష్మణ్ (మాదిగ)చోటు కల్పించారు. ఇక ఎస్టీ అయినా రామచంద్రు నాయక్ కూడా డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేశారు. స్థానిక ఎన్నికలవేళ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది.
నూతన మంత్రులుగా
బాధ్యతలు స్వీకరించబోతున్న
శ్రీ వివేక్ వెంకట స్వామి గారు,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు,
శ్రీ వాకిటి శ్రీహరి గారి కి
నా అభినందనలు.శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి
నా అభినందనలు.— Revanth Reddy (@revanth_anumula) June 8, 2025
వారికి భంగపాటు..
క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ ముగ్గురికి తీవ్ర నిరాశ ఎదురయింది. మంత్రివర్గ సమయంలో పలువురు నేతలకు చోటు దక్కలేదు. పదవి ఆశించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, వంటి నేతలు భంగపాటు గురయ్యారు. ఇక ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి పేర్లు వినిపించిన వారికి కూడా చోటు దక్కలేదు. దీంతో ఈ నేతలు మరి కొంతకాలం ఎదురుచూపులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook