Telangana Bypoll: బీఆర్ఎస్ అంటేనే.. బైపోల్. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే.. ఉప ఎన్నికలు.. స్వరాష్ట్ర సాధన కోసం అనేకమార్లు తన పదవులకు కేసీఆర్ త్యాగం చేశారు. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక.. బీఆర్ఎస్ పార్టీకి బైపోల్ టెన్షన్ పుట్టిస్తోంది. గతంలో బైపోల్‌లో లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీఆర్‌ఎస్.. ఇటీవల కంటోన్మెంట్ బైపోల్‌లో ఓటమి పాలయ్యింది.. అక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బైపోల్ జరిగింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆలోపే బీఆర్‌ఎస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో దుర్మరణం చెందారు. దాంతో జూబ్లీహిల్స్‌లోనూ బైపోల్ అనివార్యం అయ్యింది.
వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్‌కు అడ్డా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం 25 నియోజకవర్గాలు ఉండగా.. 24 చోట్ల బీఆర్‌ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది. దాంతో హైదరాబాద్‌లో ఇతర పార్టీలు గెలవడం కష్టమనే టాక్ ఉంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగిలాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పక్కలా ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అక్కడ గెలిచి.. కాంగ్రెస్‌కు సవాల్ బలంగా బుద్దిచెబుదామని భావించిన గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపొందింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బైపోల్ జరుగుతుండటంతో.. గులాబీ పార్టీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అక్కడ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్ధితి నెలకొంది. ఆరు నెలలలోపు ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డాక.. మాగంటి అడ్డగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడుసార్లు విజయం సాధించారు. కానీ ఆయన తర్వాత.. బీఆర్‌ఎస్‌లో అలాంటి స్ట్రాంగ్‌లీడర్ లేకుండా పోయారు. ఒకవేళ అక్కడ త్వరలోనే బైపోల్ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్‌కు దూరమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటికే గులాబీ పార్టీకి ఒక్కొక్కరుగా నేతలు దూరమవుతున్నారు. పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇదే పెద్ద తలనొప్పిగా మారితే.. ఇప్పుడు ఎమ్మెల్యేల మరణాలు ఆ పార్టీని మరింత కుంగదీస్తున్నాయి..
ఒకప్పుడు ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ కొత్త నియోకవర్గంగా ఏర్పాటైంది. అక్కడ మాగంటి గోపీనాథ్ మూడుసార్లు హ్యాట్రిక్ కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో.. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విష్ణు వర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతారా.. లేక.. మాగంటి కుటుంబానికే టికెట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. లేకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్‌కే టికెట్ ఇస్తారా.. లేదంటే కొత్త అభ్యర్ధిని తెరమీదకు తెస్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. పీజేఆర్ తన జీవితమంతా కాంగ్రెస్‌లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో విష్ణును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని.. జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని టాక్ సైతం వినిపిస్తోంది. మొత్తంమీద ఈ విషయంపై కొద్దిరోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
Also Read: YS Jagan: అరాచకానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
Also Read: Nara Lokesh: మహిళలు సంకర జాతీలాగా కన్పిస్తున్నారా..?.. వైసీపీ నేతలపై నారా లోకేష్ సీరియస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









