close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Updated: Apr 15, 2019, 12:37 AM IST
నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
FIle pic

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నేడు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలి ఇన్‌ఛార్జి చైర్మన్ నేతి విద్యాసాగర్ కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ హసన్, నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, జీవన్ రెడ్డి ప్రత్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించగా మిగతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోటాలో మండలికి ఎన్నికైన సంగతి తెలిసిందే.