Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.

Moosapet newly married woman suicide: తన భర్తతో ప్రతిరోజు గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో గదిలోకి వెళ్లిన చందనా జ్యోతి తెల్లవారిన కూడా  బైటకు రాకపోవడంతో భర్త కిటికిలో నుంచి చూడగా ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 14, 2025, 05:00 PM IST
  • కూకట్ పల్లిలో దారుణం..
  • ఆత్మహత్య చేసుకున్న నవవధువు..
Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.

Newly married woman commits suicide in moosapet kukatpally: ఇటీవల కొంతమంది భార్యభర్తలు ప్రతిచిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురంచేయాల్సిందిపోయి కట్టుకున్న వారిని ఎలా వేధించాలి. ఎలా స్కెచ్ లు వేసి పైకి పంపాలో అని కొంత మంది ప్లాన్ లు చేస్తున్నారు. ప్రతిరోజు భార్యభర్తలకు చెందిన హత్యలు లేదా ఆత్మహత్య ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది దంపతులు మరీ శాడిస్టులుగా మారుతున్నారు. భార్యకు వంట రాదని, అందంగాలేదని వేధిస్తున్నారు. మరికొన్ని చోట్ల భార్యలు.. తమ భర్తకు సంపాదించడం చాతన కావడంలేదని, ఇతరులతో పొలుస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

దీంతో వీరి కాపురం కాస్త పెటాకులు అవుతున్నాయి. ఇంకా కొంతమంది తమకు టైమ్ ఇవ్వడంలేదని, అస్సలు బాగా చూసుకొవడం లేదని కట్టుకున్న వారితో గొడవలకు దిగుతున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన హైదరాబాద్ లో కూకట్ పల్లిలో జరిగింది. ఈ ఘటనలో నవవధువు సూసైడ్ చేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్‌ లోని  వైస్సార్ కడప జిల్లాకు చెందిన  ప్రొద్దూటూర్ కు చెందిన చందనా జ్యోతి కి, కొత్త గూడెం నివాసి బి. వెంకసాయి యశ్వంత్ తో పెళ్లి ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం తర్వాత కొత్త జంట మూసాపేటలోని
 ఆంజనేయ నగర్ లో ఉంటున్నారు.  చందనా జ్యోతి సాప్ట్ వేర్ ఇంజనీర్ కాగా ఆమె వర్క్ ఫ్రమ్ చేస్తుంది. ఆమె భర్త  యశ్వంత్ మెడ్ ప్లస్ లో పనిచేస్తున్నాడు. అతను బాగా బిజీగా ఉంటున్నాడు.

అయితే.. తనకు టైమ్ ఇవ్వడంలేదని భార్య తరచుగా భర్తతో వాగ్వాదంకు దిగింది. కొత్తగా పెళ్లయ్యి పట్టున కొన్నిరోజులు కాలేదు.. తనను అస్సలు పట్టించుకొవడంలేదని భర్తతో గొడవలకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కాస్త పీక్స్ కు చేరిపోయాయి. ఇటీవల రాత్రి మరల చందనా జ్యోతి, వెంకటసాయి యశ్వంత్ లు గొడవలు పడి ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. ఉదయం యశ్వంత్ ఎంత డోర్ కొట్టిన భార్య డొర్ తీయలేదు. దీంతో కిటికి నుంచి చూడగా ఆమె ఉరివేసుకుంది. దీంతో వెంటనేచుట్టుపక్కల వారిని పిలిచాడు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అప్పటికే యువతి చనిపోయినట్లు సిబ్బంది చెప్పారు. మొత్తంగా చిన్న పాటి గొడవలతో పెళ్లైన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకొవడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.  

Read more: Krithi Shetty Video: బొడ్డును చూపిస్తు  హల్ చల్ చేస్తున్న కృతి శెట్టి..! .. వైరల్ గా మారి ఉప్పెన నటి వీడియో..

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనిలో కట్నం కోసం వేధించారాని, మరో యువతితో యశ్వంత్ కు ఇంట్రెస్ట్ ఉండటంవల్ల చందనను  దూరంపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దీనిపై పోలీసులు అపార్ట్ మెంట్ చుట్టుపక్క వారు, ఇరుకుటుంబాలను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇద్దరి ఫోన్ ,వాట్సాప్ చాట్ లను పరిశీలిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News