)
Nizamabad constable murder case accused died in Riyaz dies in encounter: నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ నెల 17న అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. పోలీసులకే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా పెద్ద వివాదం రాజుకుంది. దీినిపై అపోసిషన్ పార్టీలు సైతం సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశాయి.
ఈ క్రమంలో రియాజ్ ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి గాయాలు కావడంతో.. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ రియాజ్ చికిత్సలో భాగంగా ఉన్నప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ గన్ ను లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాపాలాగా ఉన్న కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పోలీసులపైనే కాల్పులకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలీపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది.
మరోవైపు నిన్న రౌడీషీటర్ రియాజ్ ను అదుపులోకి తీసుకున్న క్రమంలో ఎన్ కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని.. నగర సీపీ సాయి చైతన్య ప్రకటన చేశారు. అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం కానిస్టేబుల్ నుంచి వెపన్ లాక్కుని పోలీసులపైన కాల్పులకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook