Police Investigation: తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. 'ఫోన్ ట్యాపింగ్‌లో మీ నెంబర్ ఉందని వాగ్మూలం కోసం అధికారులు ఫోన్ చేశారు. నిష్పక్షపాతంగా సిట్ అధికారులకు వివరాలు అందించా' అని వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ విచారణ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వివరాలు వెల్లడించారు. 'ఫోన్ ట్యాపింగ్ ఒక హేయమైన, ప్రజాస్వామ్య విరుద్ధ చర్య. ఫోన్ ట్యాపింగ్ పై 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డితో కలిసి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నేను సీఎస్‌కు ఫిర్యాదు చేశాం. సిగ్గుతో తలదించుకునేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది' అని తెలిపారు.
'రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా చేయాలని చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయింది. 650 మందికి పైగా కాంగ్రెస్ కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని చెప్పారు. మేము ఓడిపోయిన ప్రతి నియోజకవర్గంలో మా ఫోన్లను ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: WTC Prize Money: దక్షిణాఫ్రికాకు డబుల్ జాక్‌పాట్.. భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
'నాటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, హోమ్ శాఖ కార్యదర్శులు రాజకీయ నాయకులకు తలొగ్గి ట్యాపింగ్ జరిపించారు. హోదా లేని ప్రభాకర్ రావుని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు. మమ్మల్ని నక్సలైట్ల సానుభూతిపరులుగా చూపిస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసీఆర్, కేటీఆర్, సంబంధిత అధికారులు శిక్షార్హులు. ఎవరినీ ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరినీ శిక్షించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలో ప్రత్యేక కేసుగా సుప్రీంకోర్టు పేర్కొంది' అని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









