)
OG Ticket Rate hikes in Telangana: జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గతంలో తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ కోవలో హరి హర వీరమల్లు సినిమా విడుదల చేశారు. తాజాగా ‘ఓజీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒక రోజు ముందు వేసే ప్రీమియర్స్ ను వెయ్యి రూపాయిల రేట్ నిర్ణయించారు. అటు ఏపీలో మల్లీప్టెక్స్ లో రూ. 150, మాములు థియేటర్స్ లో రూ. 125 పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది వచ్చె నెల 4వ వరకు అమల్లోకి ఉంటుంది.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీకి టికెట్ రేట్స్ పెంచుకోవడాని అనుమతులు మంజూరు చేసింది. స్పెషల్ ప్రీమియర్స్ రూ. 800 దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100, మల్టీప్లెక్స్ లో రూ. 150 పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్స్ తో సామాన్యులు సినిమాలకు దూరమయ్యారు. ఇక అభిమానుల బలహీనతలను అందరు స్టార్ హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు.
మొత్తంగా అభిమానుల నెత్తిన మోయలేని భారం మోపుతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణలో రచ్చ నడుస్తోంది. ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్‌ను హరీశ్‌రావు తన పోస్ట్‌కు జత చేశారు.
U TURN@RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/QcJPftqQpb
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025
ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్’ అంటూ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కూడా ఓ మాములు హీరోగా.. తన అభిమానులను సినిమా టికెట్స్ పేరిట దోచుకోవడం ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ విడుదలకు ముందే ఓవర్సీస్ లో దాదాపు $2.5 మిలియన్స్ రాబట్టం మాములు విషయం కాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.