Telangana IPS Officers: తెలంగాణలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర గడిచినా కూడా ఇంకా కుదురుకోనట్టు తెలుస్తోంది. అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి పాలనను గాడీలో పెట్టాల్సిన ప్రభుత్వం గందరగోళంలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అధికార యంత్రాంగం తమ మాట వినడం లేదని బహిరంగంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్న నేపథ్యంలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఏసీ గదులను వీడి బయటకు రావడం లేదు' అని వ్యాఖ్యానించిన తర్వాత జరిగిన ఈ పోలీస్ అధికారుల బదిలీలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: Cabinet Expansion: 'బుగ్గకారు' ఎక్కేందుకు బ్లాక్‌మెయిల్.. రేవంత్ రెడ్డి పరేషాన్
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలను బదిలీ చేయగా.. నాలుగు జిల్లాల్లో ఎస్పీలను, నలుగురు పోలీస్ కమిషనర్లను బదిలీ చేసింది. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు కూడా స్థాన చలనం లభించింది. మిగిలిన 14 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఉన్న జిల్లాలు, కమిషనరేట్లలో అధికారులను ప్రభుత్వం మార్చివేయడం చర్చనీయాంశంగా మారింది.
బదిలీ అయిన 21 ఐపీఎస్ అధికారులు వీరే!
- అనిల్ కుమార్, అదనపు డీజీ పర్సనల్
- ఎం శ్రీనివాసులు, సీఐడీ ఐజీగా బదిలీ
- అంబర్ కొషోర్ ఝా, రామగుండం పోలీస్ కమిషనర్
- సంప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్
- చేతన, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఎస్పీ
- సింధు శర్మ, ఎస్పీ ఇంటెలిజెన్స్
- రాజేష్ చంద్ర, ఎస్పీ కామారెడ్డి
- సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్
- గౌస్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనర్
- అఖిల్ మహాజన్, ఎస్పీ ఆదిలాబాద్
- రూపేష్ , ఎస్పీ ఏసీబీ
- ఆకాంక్ష యాదవ్, డీసీపీ యాదాద్రి
- పరితోష్ పంకజ్, ఎస్పీ సంగారెడ్డి
- గీతే మహేష్ బాబా సాహెబ్, ఎస్పీ సిరిసిల్ల
- అంకిత్ కుమార్, డీసీపీ, వరంగల్ ఈస్ట్
- భాస్కర్, డీసీపీ, మంచిర్యాల
- నరసింహ, ఎస్పీ సూర్యాపేట
- శిల్ప వల్లి, డీసీపీ సెంట్రల్ జోన్
- సాయి శేఖర్, ఎస్పీ ఎస్‌ఐబీ
- కరుణాకర్ , డీసీపీ, పెద్దపల్లి
- రవీందర్ , ఎస్పీ, సీఐడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









