KT Rama Rao: 'మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌': కేటీఆర్‌

KT Rama Rao Slams Uttam Revanth And Komatireddy: 'తెలంగాణ అస్తిత్వం ఉందని దేశానికి కేసీఆర్‌ ఎలుగెత్తి చాటి చెప్పింది. తెలుగు వారి గుండెల్లోంచి పుట్టింది బీఆర్‌ఎస్ పార్టీ' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌ అని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2025, 04:44 PM IST
KT Rama Rao: 'మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌': కేటీఆర్‌

  BRS Party Silver Jubilee Celebrations: తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ పార్టీ జెండా అని.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 'తెలంగాణ అస్తిత్వం ఉందని దేశానికి కేసీఆర్‌ ఎలుగెత్తి చాటి చెప్పింది. తెలుగు వారి గుండెల్లోంచి పుట్టింది బీఆర్‌ఎస్ పార్టీ' అని పేర్కొన్నారు. గులాబీ జెండా లేకపోతే తన వెంట జనం లేకపోతే తెలంగాణ లేదనేది వాస్తవం అని తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: High Court: హైడ్రాకు హైకోర్టు ఝలక్‌.. 'అందరినీ సమానంగా చూడాలి' అంటూ మొట్టికాయలు

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా గురువారం సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'భూమికి మూడడుగులు కూడా లేని వ్యక్తులు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. గ్రామ సింహాలు కూడా సింహం అనుకొని మొరుగుతున్నాయి' అని కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడ్డారు. '15 నెలల్లో మన గురించి తెలిసింది. మనమే మళ్లీ అధికారంలోకి వచ్చేదని జనం నుంచి వస్తున్న మాట' అని పేర్కొన్నారు.

Also Read: Smita Sabharwal: స్మిత సబర్వాల్‌కు భారీ షాక్‌.. చిక్కుల్లో 'కారు అద్దె' వ్యవహారం?

'2001లో గులాబీ జెండా ఎగిరింది. సుదీర్ఘ ఉద్యమ నడిపి రాష్ట్రం తెచ్చింది కేసీఆర్. మరుగుజ్జు, మోకాలు ఎత్తు ఉన్నోడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం. 25 ఏళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం. 14 యేళ్లు ఉద్యమ పార్టీ దిగ్విజయంగా నడిపింది. పదేళ్లు పాలన దేశంలో ఏ విధంగా ఉందో అభివృద్ది చేసి చూపించాం. మరో ఈ ఏడాది ప్రతిపక్ష పార్టీ గా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలా పోరాటం చేస్తోంది అనేది అందరికీ తెలుసు' అని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

'గులాబీ జెండా లేకపోతే తన వెంట జనం లేకపోతే తెలంగాణ లేదనేది వాస్తవం. చిట్టినాయుడు ప్రతిపక్ష పార్టీని తట్టుకోవడం లేదు. తెలంగాణకు చారిత్రాత్మక అవసరం బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం. కర్కశ కాంగ్రెస్ పాలన పాతర వేయాలంటే బీఆర్‌ఎస్ పార్టీ వల్లనే సాధ్యం. పార్టీ పనైపోయింది అని అనుకున్నారు. కానీ మళ్లీ గట్టిగానే లేస్తున్నాం. మీరు మాకు అండగా ఉన్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

'ఏతుల ఎంకట్ రెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల్లో ఆశలు రేపి జనాన్ని ఆగం చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు అభివృద్ది గురించి మాట్లాడలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. 'యూట్యూబ్‌ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చు. కానీ అదే యూట్యూబ్ మీ పాలన చూసి మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడుతా అంటున్నాడు' అని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు గోవిందా? అని తెలిపరు. 'భట్టి విక్రమార్క బ్యాగు చూడగానే పాత జ్ఞాపకాలు రేవంత్ రెడ్డికి గుర్తొచ్చాయి. 40సార్లు ఢిల్లీ వెళ్లాడు. రూ.30 వేల కోట్లు ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల ఖాతాల్లో పడుతున్నాయి' అని ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

  

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News