Onion lorry accident at narkatpally Nalgonda: ఇటీవల కాలంలో జనాలు మరీ ఘోరంగా తయారవుతున్నారు. ఫుకట్ లో వస్తే ఫినాయిల్ కూడా తాగేలా మారిపోయారు. పక్కన ఉన్న వాడు పుట్టేడు కష్టాల్లో ఉన్న నాకేంటీ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది వీటిని చూసి వెంటనే తమ వంతుగా సాయం కోసం పరిగెత్తుకుంటూ వస్తారు.
ఉల్లి లారీ బోల్తా – ఉల్లిపాయల దోపిడీ
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఉల్లి లారీ నార్కెట్‌పల్లి వద్ద బోల్తా పడింది.
ఘటన స్థలానికి చేరిన కొందరు ఉల్లి సంచులు ఎత్తుకెళ్లారు.
డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. pic.twitter.com/yX7u96TRJc
— greatandhra (@greatandhranews) November 10, 2025
కానీ మరికొంత మంది మాత్రం సాయం చేసే ముసుగులో తమకు ఏదైన దొరుకుతుందా..?.. అక్కడ ఏమైన విలువైన వస్తువులు పడిపోయాయా..?..అంటూ వెతుకుతుంటారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో కూరగాయల లారీలు, మద్యంలోడ్ తో వెళ్తున్న లారీలు, ఆయిల్ ట్యాంకర్ లు ప్రమాదంకు గురైనప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు కొంత మంది సాయం చేస్తే మరికొంత మంది అందిన కాడిని దొచుకుని పోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. అచ్చం అలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా పడింది. దీంతో స్థానికులు, వాహనదారులు బస్తాలను తీసుకువెళ్లడానికి ఎగబడ్డారు. జిల్లాలోని నార్కట్‌పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఈ ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ధాటికి లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.దీంతో అక్కడున్న కొంత మంది టూవీలర్ వారు, లారీల వారు గమనించి.. కనీసం లారీలో ఉన్నవారు ఏమైయ్యారని కూడా చూడకుండా అందిన కాడికి ఉల్లిసంచుల్ని తీసుకుని పారిపోయారు.
Read more: Video Viral: ఫ్రీ బస్ జర్నీకి ఇంత రుబాబా..?.. మహిళపై రెచ్చిపోయిన సీనియర్ సిటిజన్.. వీడియో వైరల్..
ఆ తర్వాత స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి బస్తాలు తీసుకెళ్తున్న వారిని అడ్డుకున్నారు.కానీ అప్పటికే చాలా బస్తాలు మాయమయ్యాయి. ఈఘటనను వీడియో తీశారు. ఆతర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









