Vanajeevi Ramaiah: పద్మశ్రీ గ్రహీత.. వనజీవి రామయ్య కన్నుమూత..

Vanajeevi Ramaiah Passes away: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 12, 2025, 07:57 AM IST
Vanajeevi Ramaiah: పద్మశ్రీ గ్రహీత.. వనజీవి రామయ్య కన్నుమూత..

Vanajeevi Ramaiah Passes away: వనజీవి రామయ్య ఇకలేరు.. కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన ఖమ్మం  ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించారు. కోటి మొక్కలు నాటిన ఆయన ప్రకృతి ప్రేమికుడిగా అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో వనజీవి రామయ్యను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్‌ మండలం అయిన రెడ్డి పల్లి..

Add Zee News as a Preferred Source

ప్రధానంగా వనజీవి రామయ్య పర్యావరణ రక్షణ కోసం చేసిన ఆయన కృషి అంతా కాదు.. 2016 లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. చిన్నప్పటి నుంచి ఆయనకు మొక్కలు నాటడం అంటే అమితంగా ఇష్టం. అలా ఆయన కోటి మొక్కల వరకు నాటారు. అయితే అసలు వనజీవి రామయ్య పేరు దరిపల్లి రామయ్య. చెట్లపై తనకు ఉన్న ఇష్టంతో వనజీవిగా మార్చుకున్నారు. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర, ఇక గ్లోబల్ యూనివర్సల్ పీస్ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. అంతేకాదు తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేసింది. తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా ప్రస్తుతం బోధిస్తున్నారు . ఇది ఇలా ఉండగా మన రామయ్య మనవళ్లు మనవరాళ్ల పేర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అన్ని చెట్లకు సంబంధించిన పేర్లే అని చెప్పాలి. చందన పుష్ప, హరిత లావణ్య, కబంధ పుష్ప, వనశ్రీ అనే పేర్లు పెట్టాడు. ఈ నేపథ్యంలో వనజీవి రామయ్యకు చెట్ల అంటే ఎంత ప్రాణమో తెలుస్తోంది.

READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం..  

ఈ నేపథ్యంలో వనజీవి రామయ్య మృతికి గాను ప్రకృతి ప్రేమికుల తో పాటు పరువు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు వనజీవి రామయ్యతో పాటు ఆయన భార్య జానమ్మ కూడా కలిసి కోటికి పైగా మొక్కలు నాటారు మొత్తంగా మన జీవి రామయ్య ప్రభుత్వ ప్రైవేటు అవార్డులతో పాటు 3 వేల షీల్డులు పొందారు. అయితే, తెల్లవారుజామున ఆయనుకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.  వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం హరితహారంలో ఆయన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నియమించింది. మొక్కలు నాటుతూ ఈయన చేసిన కృషికిగాను ఆరవ తరగతి పాఠ్యాంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రామయ్య జీవితాన్ని చేర్చింది. అంతేకాదు ఆయన ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా కూడా ఇచ్చేవారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News