Pahalgam Terror Attack news: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన మారణకాండతో భారత్ రగిలిపోతుంది . గొడవలతో ఏమాత్రం సంబంధంలేని టూరిస్టులు... పహల్గంకు వచ్చి ఉగ్రవాదుల చేతుల్లో కాల్పులకు బలయ్యారు. ఈ ఘటనపై ఇప్పటికే పాక్ పై భారత్ కఠినచర్యలకు దిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రం.. పాక్ తో ఉన్న సింధుజలాల ఒప్పందం ను రద్దు చేసుకుంది. అంతే కాకుండా.. అటారీబార్డర్ను మూసేసింది.
పాక్ వీసాలను రద్దు చేసింది. అదే విధంగా ఇప్పటికే భారత్ లో ఉన్న పాక్ ప్రజల్ని వెళ్లిపోవాలని డెడ్ లైన్ విధించింది. ఈరోజు కేంద్ర హోమంత్రి అమిత్ షా.. అన్నిరాష్ట్రాల సీఎంలతో ఫోన్ లో మాట్లాడారు. అంతేకాకుండా.. పాక్ ప్రజలు.. 48 గంటల్లో దేశం వదిలివెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అయితే.. వీసాలపై వచ్చిన వాళ్లకు.. ఏప్రిల్ 27 వరకు, అదే విధంగా మెడికల్ వీసాలపై వచ్చిన వాళ్లకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ కూడా పాక్ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.కేంద్రం హోంశాఖ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు... తెలంగాణకు వచ్చి పాక్ వాళ్లంతా..48 గంటల్లో తిరిగి వెళ్లిపోవాలన్నారు.
అంతేకాకుండా.. వివిధ పనుల మీద భారత్ జారీ చేసిన వీసాల మీద వచ్చిన వాళ్లు..ఏప్రిల్ 27 వరకు, అదే విధంగా మెడికల్ వీసాల మీద వచ్చిన వారు ఏప్రిల్ 29 వరకు దేశం వదలి వాఘా బార్డర్ దాటేయాలని కూడా తెలంగాణ డీజీపీ హుకుం జారీ చేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ వర్సెస్ పాక్ ల మధ్య పరిస్థితులు ఢీ... అంటే ఢీ అన్న విధంగా మారిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









