Panchayat Secretary Attendance Viral News: సాంకేతికతను వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాలన్న ప్రభుత్వ ఆశయానికి జగిత్యాల జిల్లాలోని ఓ పంచాయతీ కార్యదర్శి గట్టి షాక్ ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, హాజరు నమోదు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో పెట్టి అటెండెన్స్ వేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్రమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రత్యేకమైన ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను కలిగి ఉంది.. కార్యదర్శులు తాము విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుండే తమ ముఖాన్ని స్కాన్ చేసి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులు పని ప్రదేశంలో తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. అయితే, కొందరు ఉద్యోగులు ఈ యాప్‌కు కూడా తమ సొంత టెక్నాలజీని జోడించి.. హాజరును వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్నిరోజుల పాటు కొందరు కార్యదర్శుల హాజరు ఒకే గ్రామం నుంచి, ఒకే ఫోటోతో వస్తుండటంతో ఉన్నతాధికారులకు అనుమానం కలిగింది. అయితే అధికారులు దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు చేపట్టారు.. జగిత్యాల జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి చేసిన నిర్వాకం బయటపడింది. ఆయన రోజు విధులు నిర్వహించకుండా, ఇంటి వద్దనో లేదా మరెక్కడో ఉండి.. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో తన ఫోటోకు బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి హాజరు నమోదు చేసుకుంటున్నట్లు తేలింది. ఈ విషయాన్ని చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు..
ఈ ఒక్క గ్రామంలోని కార్యదర్శి మాత్రమే కాకుండా.. ఇంకా పలువురు ఇతర గ్రామాలకు చెందిన కార్యదర్శులు కూడా ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని తనిఖీల్లో వెల్లడైంది. కొందరు తమ బంధుమిత్రుల సహాయంతో తాము లేకున్నా హాజరు నమోదు చేయించుకుంటున్నారని అధికారులు తెలిపారు. మరికొందరు అయితే మరింత టెక్నాలజీని జోడించి.. పంచాయతీ కార్యాలయంలోని ఖాళీ కుర్చీలను ఫొటో తీసి, ఆ ఫొటోలను అప్‌లోడ్ చేసి అటెండెన్స్ వేసుకుంటున్నట్లు అధికారుల గుర్తించారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









