close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

‘ప్యారడైజ్ బిర్యానీ’కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం

                                        

Updated: Feb 21, 2019, 08:17 PM IST
‘ప్యారడైజ్ బిర్యానీ’కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం

భోజన ప్రియులకు హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకొచ్చే బిర్యానీ.. ముఖ్యంగా పారడైజ్ బిర్యానీ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పుడు  ‘ప్యారడైజ్ బిర్యానీ’కి అరుదైన గౌరవం దక్కింది. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’లో స్థానం సంపాదించుకుంది..ఒక్క ఏడాదిలో దాదాపు 70 లక్షల మందికి పైగా విక్రయం సాగించడంతో ఈ మేరకు గౌరవం లభించింది. అంతేకాకుండా, ‘ప్యారడైజ్’ చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది.

అ విషయాన్ని పారడైజ్ యాజమాన్యం ప్రకటించింది.  ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ప్యారడైజ్ సిబ్బంది’ కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ చైర్మన్ అలీ హేమతి మాట్లాడుతూ, తమ సంస్థకు ఈ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. బిర్యానీలో నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు తమ సిబ్బంది కృషి వల్లనే తమకు ఈ గౌరవం దక్కిందని అన్నారు.