
AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల ..నాకు పునర్జన్మను ఇచ్చిన నేల..నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షలకు దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానులతో ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ 11 ఏళ్లు పూర్తిచేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివిధ నేతలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ హరీష్ రావు కూడా ట్వీట్లు చేశారు. 'ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం ఈ తెలంగాణ' అన్ని బండి సంజయ్ పేర్కొనగా.. 'అమరవీరుల త్యాగఫలం మన తెలంగాణ' అని కోమటిరెడ్డి తెలిపారు. ఇంకా స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి వారికి జోహార్లు అంటూ హరీష్ రావు కూడా రాసుకొచ్చారు.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025
నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష…
అరువది ఏండ్ల ఆరాటం..
ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం
ఈ తెలంగాణ.
అమరవీరుల పోరాట ఫలితంగా....
చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి వంటి ఎందరో మహనీయుల యోగ దానంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ...
మహనీయుల ఆశయాలతో... ఆశయ సిద్ధికై అమరవీరుల… pic.twitter.com/M9TLbMwk73— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 2, 2025
దశాబ్దాల కాలపు కొట్లాటకు,
నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు
విముక్తి లభించిన రోజు నేడు.సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.
‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..
కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు.సబ్బండ… pic.twitter.com/K83N9b19CV
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2025
తెలంగాణకు 12 ఏళ్లు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2 తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది త్యాగాల ఫలితం.
నాణ్యమైన విత్తనాల పంపిణీ..
ఇక రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 40 వేల మంది రైతులకు కిట్లు అందించనున్నారు. వరి, కంది ,పెసర, మినుమ, జొన్న విత్తనాల కిట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
పతకావిష్కరణ..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం చేశారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook