Pearl 2025: పెర్ల్ 2025..ఇది కేవలం ఫెస్టివల్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం

Pearl 2025 Cultural Fest: బిట్స్ పిలానీ హైదరాబాద్ సాంస్కృతిక ఉత్సవం మళ్లీ వచ్చేసింది. మార్చి 28 నుంచి 30 వరకు మూడు రోజులు జరిగే ఈ వేడుకలు కళా ప్రదర్శనలతో పాటు సంగీతం, డాన్స్, ఫ్యాషన్ షోలు, థియేటర్ పోటీలు, మేధోపరమైన డిబేట్లతో అలరించనున్నాయి.    

Written by - Vishnupriya | Last Updated : Mar 21, 2025, 07:57 PM IST
Pearl 2025: పెర్ల్ 2025..ఇది కేవలం ఫెస్టివల్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం

Pearl 2025 Cultural Fest Registeration : బిట్స్ పిలానీ హైదరాబాద్ వార్షిక సాంస్కృతిక ఉత్సవం పెర్ల్ 2025 15వ ఎడిషన్‌కు సిద్ధమైంది. మార్చి 28 నుండి 30 వరకు జరగనున్న ఈ వేడుకలు.. దేశంలోని వివిధ కళాకారులను, కళాభిమానులను ఆకర్షించనున్నాయి. ఫియెస్టా డెల్ సోల్ థీమ్‌తో పండుగ వాతావరణాన్ని తీసుకురానున్న ఈ ఈవెంట్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.  

Add Zee News as a Preferred Source

పెర్ల్ ప్రో షోస్ అనేవి ఎంతోమందిని ఆకట్టుకునే ప్రత్యేకమైన ఈవెంట్స్. గతంలో సునిధి చౌహాన్, అమిత్ త్రివేది, శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ వంటి ప్రముఖులు ప్రేక్షకులను అలరించారు. ఈ సంవత్సరం మరోసారి..మరింత గ్రాండ్‌గా, అద్భుతమైన లైన్-అప్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. రాత్రిపూట లైట్స్, సంగీతం, ఊహించనటువంటి ఎనర్జీతో ఈ ఈవెంట్ మరువలేని అనుభూతిని ఇవ్వనుంది.  

పెర్ల్‌ 2025లో డాన్స్, మ్యూజిక్, థియేటర్, ఫ్యాషన్ వంటి విభిన్న కార్యక్రమాలు ప్రేక్షకుల కోసం సిద్ధం కానున్నాయి. ఇక ఈ ఈవెంట్లో జరిగే ప్రోగ్రామ్స్ వివరాల్లోకి వెళితే..:  
- టెర్ప్సికోర్: దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ డాన్స్ గ్రూపులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి.  
- టిల్ డెఫ్ డూ వి పార్ట్: రాక్ బ్యాండ్స్ శక్తివంతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి.  
- గ్లిటరాటి: ఇది కళ, సృజనాత్మకత, ఫ్యాషన్‌ల మేళవింపు.  
- కాలిడోస్కోప్: ఉత్తమ కథనాలను తెరపై ఆవిష్కరించే షార్ట్ ఫిల్మ్ పోటీ.  

కేవలం వినోదం మాత్రమే కాదు, మేధోపరమైన పోటీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడి ఉన్నాయి.  
- పెర్ల్ పార్లమెంటరీ డిబేట్: వివిధ విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన ప్రతిభావంతుల మధ్య డిబేట్ జరగనుంది.  
- నుక్కడ్ నాటక్: సమాజంపై పరోక్షంగా సందేశం ఇచ్చే వీధి నాటకాలు ప్రదర్శించనున్నారు.  
- హాహా హంట్: హాస్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ప్రతిభ చూపించే స్టాండ్‌ప్ కామెడీ పోటీ సైతం జరగనుంది.  

మొత్తం పైన పెర్ల్ 2025 అనేది అనుభవాలను పంచుకునే వేదిక. వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా ప్రముఖులు తమ జ్ఞానాన్ని ఈ ఈవెంట్ లో పంచుకోనున్నారు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి ఇది మంచి అవకాశంగా మారనుంది.  

ఈ వేడుకకు రిజిస్టర్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి: [Unifest](https://unifest.in/fests/49?fest=pearl-2025)  

మరింత సమాచారం కోసం: pearl@hyderabad.bits-pilani.ac.in  

పెర్ల్ 2025 — ఇది కేవలం ఫెస్టివల్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం!

Read more: Soundarya Property: సౌందర్య ఆస్తిని కాజేసింది మోహన్ బాబు కాదు.. ఆయనే.. షాకింగ్ నిజం రివీల్ చేసిన నిర్మాత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News