)
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట నిర్వహిస్తున్న సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి ఆహ్వానం పలకనున్నారు. ఈ సదస్సుకు ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానం పలకనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది.
హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా.. యువతకు అవగాహన కల్పించేందుకు ఈరోజున వస్తే సెలవు పబ్‌లు, జులాయిగా తిరగడంపై కొడుకును తల్లి చితకబాదింది.
సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నట్లు సమాచారం. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా రేవంత్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా.. అందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కార్యాక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయం వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook