PM Modi: గెలిచిన తెలంగాణ ఎమ్మెల్సీ లకు ప్రధాని మోడీ విషెస్.. కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు..

PM Modi: తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అంతేకాదు తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకొని సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్ధులతో పాటు కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాన నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2025, 11:14 AM IST
PM Modi: గెలిచిన తెలంగాణ ఎమ్మెల్సీ లకు ప్రధాని మోడీ విషెస్.. కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు..

  

Add Zee News as a Preferred Source

PM Modi: తెలంగాణలో జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. అందులో కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రముఖ విద్యావేత్త మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అటు ఉత్తర తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీతో దోబూచలాడింది. తీవ్ర ఉత్కంఠ నడుమ బీజేపీ అభ్యర్ధి ఉమ్మడి  అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయ బావుటా ఎగరేసారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. ఇక్కడ కాంగ్రెస్‌ తన సిటింగ్‌ సీటును కోల్పోయింది. కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాల  నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం కావడంతో ప్రధాని మోడీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలతో పాటు  బీజేపీ కార్యకర్తలకు ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.                        

ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణలో బీజేపీ పార్టీ ఆదరించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నానన్నారు.

మరోవైపు ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇద్దరు ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారు. విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ఎక్స్ లో ట్వీట్ చేసారు.

మొత్తంగా తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్నామ్నాయమని సంకేతాలు పంపించింది భారతీయ జనతా పార్టీ.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News