Sri Ram Navami Shobha Yatra: శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే భారీ శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. హిందూ సంఘాలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా.. హైదరాబాద్ నగరం మొత్తం కాషాయమయం కాబోతున్నది. దేశంలోనే ప్రత్యేకంగా నిలిచే ఈ శోభయాత్ర భారీ స్థాయిలో జరగనుండగా పోలీసులు కూడా అదే స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటుచేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.
Also Read: Harish Rao: 'కేసీఆర్‌కు దిష్టి తగలడంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు'
శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసు అధికారులతో కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శోభయాత్రకు బందోబస్తుపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గతంలో శోభాయాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్ల విషయమై చర్చించి వారికి సూచనలు జారీ చేశారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి, ఇతర శాఖల అధికారులతో శ్రీరామనవమి శోభాయాత్ర విషయమై జరిగిన చర్చలు, ప్రధాన ఊరేగింపు మార్గంలో ఉన్న లోటుపాట్లను అధికారులకు కమిషనర్ వివరించారు.
Also Read: Bhatti Vikramarka: నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారణంగానే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి
చిన్న ఊరేగింపుల అనుసంధానమయ్యే కూడలి వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కమిషనర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మతపరమైన ప్రదేశాలు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ప్రత్యేక అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు. నిరంతరం నిఘా కొనసాగించాలని చెప్పారు. ముందస్తు చర్యగా అధికారులు, సిబ్బంది నగరంలోని అన్ని జోనల్ కంట్రోల్ రూమ్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు అందరూ ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
ప్రత్యేకంగా శోభా యాత్రలో ఎలాంటి పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా చూడాలని పోలీస్ అధికార యంత్రాంగానికి కమిషషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో బందోబస్తుపై ప్రత్యేక సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ ఉన్నత అధికారులు విక్రమ్ సింగ్ మాన్, చైతన్య కుమార్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









