చెవెళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు

పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన కేసులో చెవెళ్ల కాంగ్రస్ పార్టీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు

Updated: Apr 17, 2019, 02:06 PM IST
చెవెళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్ధిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే ఆరోపణలపై ఆయనపై కేను నమోదు చేశారు

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన నగదుకు సంబంధించి విశ్వేశ్వర్‌రెడ్డి కార్యాలయంలో  నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లారు.

ఈ సమయంలో విశ్వేశ్వర్‌రెడ్డి... ఎస్సై కృష్ణను గదిలో బంధించి బూతులు తిట్టి విధులకు ఆటంకం కల్గించారని ...తన సిబ్బందితో కలిసి  డ్యూటీలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్సై కృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఉన్నాధికారులు విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు