President Draupadi Murmu Hyderabad tour: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి భాగ్యనగరానికి రానున్నారు. బెంగళూరు నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్, తదితరులు దేశ ప్రథమ పౌరురాలుకు స్వాగతం పలకనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు ద్రౌపది ముర్ము హెలికాప్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుంచి అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి హెలికాప్టర్ లో హరీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు భారత వాయుసేన విమానంలో నాగపూర్ కు బయలుదేరి వెళ్తారు. 


ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సైబరాబాద్ పోలీసులు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 07 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. వాహనదారులు ప్రత్యామ్యా మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. 


Also Read: PM Modi to Visit Warangal: ఈ నెల 8న వరంగల్‌కు ప్రధాని మోదీ.. భారీగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి