)
Private Colleges Close: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలకు బకాయి పడిన డబ్బులను వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రైవేటు కళాశాలల జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో .. తమ దగ్గర పనిచేసే లెక్చరర్స్ నుంచి హౌస్ కీపింగ్ స్టాఫ్ వరకు జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ రోడ్డుకు ఎక్కారు. గతంలో బంద్ కు పిలుపునిచ్చినపుడు ప్రభుత్వం బకాయిలు త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో బంద్ ను వాయిదా వేశారు. అయితే ఇది చెప్పి చాలా రోజులు దాటిపోయాయి. దీంతో ప్రైవేటు కాలేజీలు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం రోడ్డుకెక్కి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దశలవారీగా ఉద్యమాలకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపు నిచ్చింది. 4వ తేదీన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి రిప్రజెంటేషన్ సమర్పించనున్నారు. ఈ నెల 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల లెక్చరల్లు, స్టాఫ్, సిబ్బంది తో కలిసి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ..
10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ తో చలో సెక్రటేరియట్ కు పిలుపు నిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని అల్టీమేటం జారీ చేశారు. తమకు అనుకూలంగా వ్యవహరించని కాలేజీలపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయిస్తుందన్నారు. అలాంటి దాడులకు కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య భయపడబోమని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు శాంతి యుతంగా పోరుబాట పట్టాయి. ఇప్పటికే సర్కారుపై జంగ్ సైరన్ మొగించాయి. దీనిలో భాగంగా నేటి (సోమవారం) నుంచి కాలేజీల నిరవదిక బంద్ తలపెట్టాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఐటీఐ కళాశాలల్లో నిరవధిక బంద్ సోమవారం నుండి నిర్వహిస్తున్నట్టు జేఏసీ వెల్లడించింది. ప్రభుత్వం వెంటనే మానవత దృక్పథంతో స్పందించి వెంటనే తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సమాఖ్య దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.