Raithu Bharosa: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్.. మాటలకు తప్పితే చేతలకు పెద్దగా పొంతన ఉండటం లేదు. ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది తప్ప.. పనులేమి చేయడం లేదనేది ప్రతిపక్షాల వాదన. ఆ సంగతి పక్కన పెడితే.. తెలంగాణ సర్కార్..
రైతు భరోసా పథకం కింద జూన్ మూడో వారం నాటికి పెట్టుబడి సాయం అందించేందుకు సిద్దం అవుతోంది. ఎకరానికి రెండు విడతలుగా 6వేల చొప్పున కాకుండా ఒకేసారి 12 వేలు జమ చేసే ఆలోచనలో ఉంది.
ఇదిలా ఉంటే 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే సాయం అందింది. దీని కోసం ప్రభుత్వం రూ. 4 వేల కోట్లకుపైగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు త్వరలోనే సాయం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు.
జూన్ మొదటి వారంలోగా రైతులు ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. తెలంగాణలో దాదాపు 70 లక్షల మందికి రైతు భరోసా సాయం అందుతోంది. ఒకే విడతలో ఎకరానికి రూ. 12వేల చొప్పున సాయం విడుదల చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కనీసం 15వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో విడతల వారీగా రైతులకు నిధులను విడుదల చేస్తోంది.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









