Rajiv Yuva Vikasam Apply Process: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 'రాజీవ్ యువ వికాసం' దరఖాస్తుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఇది అద్భుతమైన ఛాన్స్. ఈ పథకంలో దరఖాస్తు చేసుకుంటే రూ.3 లక్షల వరకు రుణాలు పొందుతారు. ఇందులో 90 శాతం వరకు రాయితీ కూడా లభిస్తుంది.
మార్చి 17వ తేదీనే 'రాజీవ్ యువ వికాసం' పథకానికి సంబంధించిన పోర్టల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఇది అద్భుత అవకాశం. స్వయం ఉపాధి కోసం రూ.3 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ఇందులో 90 శాతం వరకు రాయితీ కూడా పొందుతారు.
https://tgobmms.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పించారు. జూన్ 2వ తేదీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తారు.
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి..
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవాలంటే మీ వద్ద రేషన్ కార్డు తప్పనిసరి. లేదా ఆదాయ ధ్రువ పత్రం ఉండాలి.
ఆధార్, ధ్రువీకరణ పత్రంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. అగ్రికల్చర్ యూనిట్ కి దరఖాస్తు చేసుకుంటే పట్టాదారు పాస్ బుక్.
దివ్యాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్.
అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక డౌన్లోడ్ చేసి ఎంపీడీఓ లేదో జోనల్ కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానంగా కలెక్టర్లు పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సంబంధిత కార్పొరేషన్‌లలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందుబాటులో ఉంచారు.
రూ.50 వేల నుంచి రూ.లక్ష రుణం తీసుకున్న వారికి 90 శాతం వరకు రాయితీ పొందుతారు.
రూ.2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం వరకు ప్రభుత్వ రాయితీ పొందుతారు.
అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50,000 మించి ఉండకూడదు.
పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలలోపు ఉండాలి.
దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇక ఈ పథకానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ.6000 కోట్ల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. విధివిధానాలను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారిని ఫైనల్ చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రుణాలు మంజూరు చేస్తారు.
ఇదీ చదవండి: Facial: ఇంట్లోనే కాఫీ ఫేషియల్.. ఖర్చులేని కాంతివంతమైన స్కిన్..
ఇదీ చదవండి: Morning Vs Evening Walk: ఉదయం లేదా సాయంత్రం గుండె ఆరోగ్యానికి ఎప్పుడు వాకింగ్ చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









