Rajiv Yuva Vikasam: రేపటి నుంచే 'రాజీవ్‌ యువ వికాసం' అమలు.. ఎవరు అర్హులు? ఈ పథకం లాభాలు ఏంటి?

Rajiv Yuva Vikasam Benefits: రాజీవ్‌ యువ వికాసం పథకం తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఎంపికైన వారికి రుణాలను మంజూరు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఎవరు అర్హులు? ఇందులో బెనిఫిట్స్ ఏముంటాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Jun 1, 2025, 10:27 AM IST
Rajiv Yuva Vikasam: రేపటి నుంచే 'రాజీవ్‌ యువ వికాసం' అమలు.. ఎవరు అర్హులు? ఈ పథకం లాభాలు ఏంటి?

 Rajiv Yuva Vikasam Benefits: రాజీవ్‌ యువ వికాసం పథకం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు సోమవారం అంటే జూన్ 2వ తేదీ నుంచి అమలు కానుంది. తొలి దశలో రూ.50,000 రూ.లక్ష రుణాలకు ఎంపికైన వారికి మంజూరు చేస్తారు. పత్రాలు పంపిణీ చేసి 10 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇచ్చి 15 నుంచి యూనిట్లు ప్రాసీడింగ్‌ కానున్నాయి.ఈ  ఏడాది రూ.6000 కోట్లతో మొత్తంగా ఐదు లక్షల మందికి ఈ స్కీం అమలు కానుంది. ఆ తర్వాత దశలో రూ.4 లక్షల వరకు కూడా రుణాలు మంజూరు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Add Zee News as a Preferred Source

 రాజీవ్ యువ వికాసం లక్ష్యం..
 ఈ పథకం ప్రధాన లక్ష్యం యువతకు నైపుణ్య అభివృద్ధి చేయడం. విద్య ఉపాధి అవకాశాలు కల్పించడం. ఉపాధి రంగంలో పోటీకి తగిన శిక్ష. దీంతో పాటు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించడం. 

 ప్రధానంగా ఈ పథకం ద్వారా సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించవచ్చు. యువకుడి భవిష్యత్తు నిర్మాణానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. నిరుద్యోగ సమస్యకు రాజీవ్‌ యువ వికాసం పథకం ఒక పరిష్కారం అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.

 ఎవరు అర్హులు?
 రాజీవ్ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన యువత అర్హులు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఈ పథకానికి అర్హులు. తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.  2025 మార్చి 15వ తేదీ నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్ లో ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వీరందరి పత్రాలను స్క్రూటినీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తోంది.

 రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ.50,000, రూ.లక్ష వరకు రుణాలను మంజూరు చేస్తుంది. మొదటి విడతలో రూ.50,000 రూ.లక్ష రుణాలను మంజూరు చేస్తుంది. అర్హులైన వారిని ఎంపిక చేసి రేపు మంజూరు పత్రాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని రుణాల మంజూరుకు సన్నద్ధం అవుతుంది. రాజీవ్‌ యువ వికాసం పథకానికి 80 శాతానికి పైగా రూ.4 లక్షల రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి:  20వ విడుత పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆరోజే.. ఇలా చెక్ చేసుకోండి..

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. జూన్‌ 1వ తేదీ ఏ రాశుల జాతకం ఎలా ఉంటుంది తెలుసుకోండి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News