Kavith Vs Ramya Rao: కవితకు కేసీఆర్ పై గౌరవం ఉంటే..అలా మాట్లాడి ఉండకూడదు..రమ్య రావు ఆసక్తికర వ్యాఖ్యలు..

Kavith Vs Ramya Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కవిత సీఎం రేవంత్ పై భగ్గుమంది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వెనక కేసీఆర్ కాదు.. హరీష్ రావు ఉన్నారన్నారు. దీనిపై కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు కవితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2025, 10:05 AM IST
Kavith Vs Ramya Rao: కవితకు కేసీఆర్ పై గౌరవం ఉంటే..అలా మాట్లాడి ఉండకూడదు..రమ్య రావు ఆసక్తికర వ్యాఖ్యలు..

Kavith Vs Ramya Rao: కవిత.. తన తండ్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ గురించి మాట్లాడుతుంది. సిబిఐ అంటుంది. తండ్రి తండ్రి మీద అంత దారుణంగా సిబిఐ ఎంక్వైరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తే.. మొత్తం రాష్ట్రం బగ్గుమనాలే అని అంటది. మరి నేను ఏమంటా అంటే కవితను సూటిగా వాస్తవంగా కెసిఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ లో ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు అందులో నిజాలు ఉండవచ్చు. లేకపోవచ్చు.   ఏ కూతురైనా వాస్తవంగా  ఈ విసయంలో బాధపడతది. కానీ నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా కవితను ఇక్కడి నీవు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే చేతల్లో చిత్తశుద్ధి ఉండాలంటే ఏ బిఆర్ఎస్ కండువ కప్పుకొని ఆ జెండాతో ఎమ్మెల్సీగా ఉన్నావో.. ఆ కండువా వేసుకొని సభ్య సమాజం ఒక తండ్రి గురించి ఒక కూతురు ఆవేదనపడుతున్నది అని అనుకునేవాళ్ళు.  కానీ కేవలం ఇక్కడ హరీష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అంటే కేసీఆర్ ను కేవలం డమ్మీగా ఉన్నారు. అంతా హరీష్ రావు కనుసన్నల్లో ఈ తతంగం అంతా జరిగిందనే వాదన ప్రజల్లోకి వెళుతుంది. 

Add Zee News as a Preferred Source

గత ప్రభుత్వ హయాములో ఏం జరిగిందో క్యాబినేట్ మంత్రులు కానీ ఇతరులు ఏ నిర్ణయం తీసుకున్న దానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ దే బాధ్యత అవుతుందన్నారు. ఇక సెకండ్ టర్మ్ లో హరీష్ కు మంత్రి పదవిఇవ్వలేదు అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు. అపుడే మాట్లాడాల్సింది అన్నారు. ప్రస్తుతం కవిత మాటలు వింటుంటే కేవలం ఆధిపత్య పోరు కోసమే కవిత మాట్లాడుతున్నట్టు ఉంది. కవిత ో  కుటుంబ సభ్యురాలివి కాదు అక్కడ. 
ఒక ముఖ్యమంత్రి కూతురువు అధికారంలో ఉన్నావు. నువ్వు రెండు సార్లు కూడా గవర్నమెంట్ లో ఉన్నావు.  ఉండి అవినీతి జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల పేర్లుచెప్పింది. 

ఈ రోజు రాజ్యసభ సభ్యుడు అని చెబుతుంది. సంతోష్ రావు అని అంత చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదన్నారు.  సంతోష్ పేరు చెప్పడానికి అంత ధైర్యం లేని నువ్వు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏ రకంగా కరెక్టు.  మరి గతంలో వీళ్ళ వల్ల కెసిఆర్ గారి మీద బురద
అంటుకుంటుంది.  మరక అంటుకుంటుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు ఇదే రకంగా బయటిక వచ్చి ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నలు సంధించింది. అపుడే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవినీతి జరుగుతుంది. మీ నాన్నకు మరకంటుతుందని ముఖ్యమంత్రిగా ఆయనకు ఇబ్బంది పాలవుతాడి అపుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. 

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నేను 2017లో జయలలిత గారెకి జరిగిందే కెసిఆర్ గారికి జరగబోతుంది. అక్కడ అట్లా జరుగుతుంది అని నేను చెప్పాను. తెలంగాణ జాగృతి పేరుతో నువు చేసిన దందాలు నాకు తెలుసు. ఇక లిక్కర్ స్కామ్ లో నువ్వు అరెస్ట్ అయినపుడు ఎవరు పెద్దగా మద్దతు పలకలేదు. ఇక్కడ క్యాడర్ కూడా పెద్దగా స్పందించలేదు. అవన్ని మనసులో పెట్టుకునే ఇలా కేసీఆర్ పై కాకుండా ఆయన చుట్టు చేరిన దెయ్యాలంటూ హరీష్ రావు, సంతోష్ రావులను కవిత ఇపుడు టార్గెట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: HBD Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..

ఇదీ చదవండి: Jr NTR Worst Record: పాతికేళ్ల సినీ కెరీర్ లో ‘వార్ 2’ తో ఎన్టీఆర్ ఖాతాలో పరమ చెత్త రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News