• 542/542 TARGET 272
  • BJP+

    350BJP+

  • CONG+

    89CONG+

  • OTH

    103OTH

Full coverage

ఇంటర్ విద్యార్ధులకు ఊరట; రీ వెరిఫికేషన్ గడువు పెంపు

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ఊరటకల్చించే నిర్ణయం వెలువడింది

Updated: Apr 23, 2019, 10:13 PM IST
ఇంటర్ విద్యార్ధులకు ఊరట; రీ వెరిఫికేషన్ గడువు పెంపు

విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది . ఇంటర్‌ పేపర్‌ రీ-వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచారు. వాస్తవానికి బుధవారంతో  గడువు ముగుస్తుంది. తాజా నిర్ణయంతో గడువును ఈ నెల 27 వరకు పెంచినట్లయింది. విద్యార్ధులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది

ఇదే సందర్భంలో ఇంటర్ బోర్డు మరో ప్రకటన చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ  ఫీజు చెల్లింపునకు కూడా మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 వరకూ గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు.

ఇంటర్‌ మార్కుల విషయంలో  తమకు అన్యాయం చేశారని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీ-వెరిఫీకేషన్ కోసం గడువు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు స్పందించారు.