Telangana Assembly: వేముల వర్సెస్‌ కోమటిరెడ్డి.. త్రిబుల్‌ ఆర్‌పై అసెంబ్లీలో రచ్చరచ్చ

Telangana Assembly Session Vemula Prashanth Reddy vs Komatireddy: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మరో అంశంలో కాంగ్రెస్‌ వైఫల్యాన్ని ఎండగట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రభుత్వ తప్పిదాలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎత్తి చూపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2025, 03:58 PM IST
Telangana Assembly: వేముల వర్సెస్‌ కోమటిరెడ్డి.. త్రిబుల్‌ ఆర్‌పై అసెంబ్లీలో రచ్చరచ్చ

Vemula Prashanth Reddy vs Komatireddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ దూకుడుగా వెళ్తోంది. అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందిన రేవంత్‌ రెడ్డి పాలనను తిప్పి కొడుతూ.. ప్రవేశపెట్టిన డొల్ల బడ్జెట్‌పై తీవ్రంగా తప్పుబడుతోంది. గులాబీ పార్టీకి చెందిన ప్రతి సభ్యుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తప్పిదాలను సభ ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు అంశంపై కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ సభలో నిలదీసింది. ఈ క్రమంలో కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీరును మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎండగట్టారు. వారిద్దరి మధ్య యుద్ధం జరిగినట్టు చర్చ జరిగింది.

Add Zee News as a Preferred Source

Also Read: Drunk And Drive: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ రికార్డులు బద్దలు.. 'గిన్నీస్‌ బుక్‌లో' నీ పేరు పక్కా బ్రో!

'ఆర్‌ఆర్‌ఆర్‌' కేసీఆర్‌ మదిలో పుట్టిన ఆలోచన
'రీజినల్ రింగ్ రోడ్డుకు అంకురార్పణ చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది కేసీఆర్‌ మదిలో పుట్టిన ఆలోచన. 2015 నుంచి కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు చేస్తే 2017లో ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 50 శాతం నిధులు ఇస్తామని నాటి సీఎం కేసీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు' అని వేముల ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.

Also Read: Group 1 Mains: తెలంగాణ గ్రూప్‌ 1లో బిగ్‌ ట్విస్ట్‌.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

'కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశా.. నా కంటే ముందు ఆర్‌అండ్‌బీ మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వర్‌ రావుకు కూడా తెలుసు. ఆయన కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం గడ్కరీని కలిశారు. పలు మార్లు అప్పటి సీఎం కేసీఆర్, నేను సంప్రదింపులు చేస్తే కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను భారత్ మాల కార్యక్రమంలో చేర్చింది' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. 'భూసేకరణ కోసం రూ.100 కోట్లు డిపాజిట్ చేశాం. నార్త్ పార్ట్ భూసేకరణ 80 శాతం పూర్తి చేశాం.. 3డీ కూడా చేశాం' అని వెల్లడించారు. సదరన్ పార్ట్‌కు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని చెప్పారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేయలేదు. నేను మాట్లాడుతున్న మాటపై నిలబడుతున్నా. ఒక్క మాట తప్పు చెప్పట్లేదు.. ఆన్ రికార్డు చెబుతున్నా' అని కాంగ్రెస్‌ తప్పిదాన్ని అసెంబ్లీలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎండగట్టారు. '3డీ చేసిన దానికి అవార్డు ఇచ్చి రైతులకు నష్ట పరిహారం చెక్కులు ఇవ్వాలి అంతే! ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రూ3 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టాలి కానీ రూ.1,500 కోట్లు పెట్టారు' అని తప్పుబట్టారు.

'రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కేంద్రం నిధులు ఇచ్చే ఆస్కారం ఉండదు. దానిపై దృష్టి సారించాలి' అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సౌత్ పార్ట్ భూసేకరణ అంశం క్లారిటీ లేదని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ సభ్యుడు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగంపై కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌కు 2017లోనే 161ఏఏ ఎన్‌హెచ్‌ నంబర్ కేటాయించారు. వాళ్లు భూ సేకరణ ఏమీ చేయలేదు. 80 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్.. దాన్ని అమ్ముకుంది వాళ్లే. రోడ్లు అమ్ముకున్న వాళ్లు.. రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు' అని ఎద్దేవా చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News