Rtd Employees: 'అంత చేసి ఇంతేనా?'.. తెలంగాణ డీఏలపై రిటైర్డ్‌ ఉద్యోగుల అసహనం

Retired Govt Employees Totally Disappoints With Telangana DA: కమిటీలు.. చర్చల పేరిట నానా హంగామా చేసి చివరకు ఒక్క కరువు భత్యంతో సరిపెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వంపై రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఉద్యోగ వర్గాలను రేవంత్‌ రెడ్డి తీవ్ర మోసం చేశారని మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 6, 2025, 01:50 PM IST
Rtd Employees: 'అంత చేసి ఇంతేనా?'.. తెలంగాణ డీఏలపై రిటైర్డ్‌ ఉద్యోగుల అసహనం

Telangana DA: ఎన్నికల్లో గొప్పగొప్ప మాటలు.. అధికారంలోకి వచ్చాక మాత్రం నెలల తరబడి కాలయాపన చేసి చివరకు ఒక్క డీఏ ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. అంత హడావుడి చేసి చివరకు ఇచ్చింది ఒక్క డీఏనా? అని పెదవి విరుస్తున్నారు. ఆర్భాటపు హడావుడి మినహా చేసిందేమీ లేదని.. కంటి తుడుపు చర్యకు కూడా ఇది పనికిరాదని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఏపై ఆయన కీలక ప్రకటన చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: 2% DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెరుగుదల.. కనీస వేతనంలో భారీగా మార్పులు

'ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 కరువు భత్యాల విడుతలు పెండింగ్‌లో పెట్టి.. ఇప్పుడు కేవలం ఒక డీఏ విడుదల చేయడం ఉద్యోగ వర్గాలను మోసం చేయడమే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌ ప్రకటించారు. భారతదేశ చరిత్రలోనే ఆరు నెలల తర్వాత విడుదల చేసే డీఏను ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

'రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు నెలకు కేవలం రూ.700 కోట్లు విడుదల చేస్తే  ఇప్పటివరకు ఉన్న బకాయిలు విడుదల చేయాలంటే 18 నెలల కాలం పడుతుంది' అని దేవీ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2025 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పడు ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో రిటైరయ్యే ఉద్యోగులు మూడేళ్లు పెన్షన్ ప్రయోజనాలు రాక వేచి చూసే దుస్థితి పరిస్థితి వచ్చిందని వివరించారు.

Also Read: Bunny Vas: 'ఏంది పావలా గోల?' అగ్ర హీరోలు, నిర్మాతలపై బన్నీ వాస్‌ ఫైర్‌

'రెండు, మూడు విడతలలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు విషయంలో ఒక నిర్ణయానికి రావడం.. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయడం  స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్‌పై స్పష్టత ఇచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, యూనివర్సిటీ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి' అని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్‌ చేశారు.

'అభయ హస్తం మేనిఫెస్టోలో పీఆర్‌సీ ఆరు నెలలో అమలు చేస్తామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన లేకపోవడంతో ఇప్పట్లో పీఆర్సీ రాదు' అని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రకటించారు. 'కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దు చేస్తామని చెప్పి  18 నెలల పాలన పూర్తయినా కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.  టీడీపీపరిపాలనలో 9 విడతల డీఏలు పెండింగ్ పెట్టిన చరిత్రను రేవంత్ రెడ్డి తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు' అని దేవీప్రసాద్‌ ఎద్దేవా చేశారు. అదే ఆనాడు చంద్రబాబు అధికారం కోల్పోవడానికి కారణమైందని గుర్తుచేశారు. చాలా సమస్యలు పరిష్కారం చేశామని చెబుతున్న ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీఓలు అమలు కోసం మంత్రివర్గ నిర్ణయం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి పునరాలోచన చేసి న్యాయం జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News