Telangana IAS Officers Transfers: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఐఏఎస్‌ల తాజా బదిలీలో ఆమెను లూప్ లైన్లో పెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర పర్యటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆ పోస్ట్ నుంచి తప్పించింది. రాష్ట్ర పర్యటక సాంస్కృతిక శాఖను జయేష్ రంజన్‌కు కేటాయించింది. అయితే ఆమెను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోస్ట్ పెట్టడంతోని ప్రభుత్వం పక్కన పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇదే అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భారీగా ఐఏఎస్ అధికారులు ఈరోజు వివిధ శాఖల్లోకి కూడా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30వ తేదీన రిటైర్మెంట్ అవ్వనున్నారు. చాలా కాలంగా కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె.రామకృష్ణారావును ఎంపిక చేసింది. ఆయనతోపాటు మరో ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. అందరీ పేర్లను పరిశీలించిన ప్రభుత్వం.. రామకృష్ణ సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎస్‌గా నియమించింది.
అధికారుల బదిలీలు ఇలా..
1. ఆర్.వి.కర్ణన్ - కమిషనర్, GHMC
2. జయేష్ రంజన్ - స్పెషల్ చీఫ్ సెక్రటరీ & CEO, ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ CMO & SPEED, FAC స్పెషల్ చీఫ్ సెక్రటరీ, YAT&C విభాగం, ITE&C, స్పోర్ట్స్ విభాగం
3. సంజయ్ కుమార్ - స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ & కామర్స్ విభాగం, ITE&C, స్పోర్ట్స్ విభాగం
4. ఎం.దాన కిషోర్ - ప్రిన్సిపల్ సెక్రటరీ, LET&F విభాగం; అలాగే FAC కమిషనర్, లేబర్; డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్; డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్
5. టి.కె.శ్రీదేవి- ప్రభుత్వ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (HMDA Out Side); FAC కమిషనర్ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
6. కె.ఇలంబరితి - ప్రభుత్వ కార్యదర్శి, మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (HMDA Limits)
7. కె.శశాంక - కమిషనర్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA); FAC డైరెక్టర్, మైన్స్ & జియాలజీ
8. ఎస్.హరీష్ - CMD, GENCO; FAC స్పెషల్ కమిషనర్, I&PR & E.O. స్పెషల్ కమిషనర్, కార్యదర్శి, GA(I&PR) విభాగం; FAC ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (DM), రెవెన్యూ విభాగం
9. కె.నిఖిల - FAC కార్యదర్శి & CEO, తెలంగాణ మానవ హక్కుల కమిషన్
10. ఎస్.సంగీత సత్యనారాయణ - డైరెక్టర్, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం; అలాగే FAC CEO, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
11. ఎస్.వెంకటరావు - డైరెక్టర్, ఎండోమెంట్స్; FAC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యాదగిరిగుట్ట ఆలయం
12. స్మితా సబర్వాల్-ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ
13. పి.కాత్యాయనీ దేవి - అదనపు CEO, SERP
14. E.V.నర్సింహ రెడ్డి - అదనపు CEO, ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ & స్పీడ్; FAC మేనేజింగ్ డైరెక్టర్, ముసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL)
15. భోర్ఖడే హేమంత్ సహదేయోరావు - జోనల్ కమిషనర్, GHMC
16. G.ఫణీంద్ర రెడ్డి - మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)
17. P.కధిరవన్ - జాయింట్ కమిషనర్, PR & RD
18. K.విద్యా సాగర్ (నాన్-కేడర్) - అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), హైదరాబాద్; FAC చీఫ్ రేషన్ ఆఫీసర్, హైదరాబాద్
19. R.ఉపేందర్ రెడ్డి (నాన్-కేడర్)- కార్యదర్శి, HMDA
Also Read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
Also Read: Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగం.. యుద్ధనౌకల మోహరింపు వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి