Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు. అటు పార్టీ పరంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఛీఫ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటి కానున్నారు. ఈ రోజు విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం చర్చించేందుకు విదేశాంగశాఖ మంత్రితో సీఎం సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, శిక్ష పడేట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జైశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్ లు కూడా మంత్రి రేసులో ఉన్నారు. ఒకవేళ అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి వరిస్తే.. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు చెక్ పడినట్టే. ఒకవేళ మాల వర్గానికి సంబంధించి వారికి మంత్రి వర్గంలో తీసుకుంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
మరోవైపు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సారి మంత్రి కావాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో ఈయనకు క్యాబినేట్ లో చోటు దక్కడం డౌటే అని చెబుతున్నారు. తెలంగాణలో మొత్తంగా 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు 4 గురు రెడ్లు ఉన్నారు. ఈ సారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అందులో ఒకటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు మైనారిటీలకు మేమే అండ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఒక్కరు కూడా మినిష్టర్ లు గా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనుచూప మేర కనిపించడం లేదు. తాజాగా భర్తీ చేసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింట్లో ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించారు. దీంతో ఈ సారి మంత్రి వర్గంలో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించినట్టే అని చెప్పాలి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









